Retirement: ధోనీకే చుక్కలు చూపించిన మొనగాడు..రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ సెంచరీ వీరుడు..! ఐపీఎల్‌లో రాజస్థాన్, పంజాబ్ తరుఫున ఆడిన పాల్ వాల్తాటి క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీతో లైమ్ లైట్‌లోకి వచ్చిన వాల్తాటి ధోనీ చేత ప్రసంశలు అందుకున్న అతి కొద్దిమంది బ్యాటర్లలో ఒకరు. By Trinath 19 Jul 2023 in Scrolling స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రత్యర్థి కెప్టెన్‌గా ధోనీ(Dhoni) ఉన్నప్పుడు భారీ స్కోర్ సాధించడం అంత ఈజీ కాదు. టెస్టు ఫార్మెట్ సంగతి పక్కనపెడితే లిమిటెట్ ఓవర్లతో పాటు ఐపీఎల్‌లోనూ మహేంద్రుడి కెప్టెన్సీ తిరుగులేనిది. బ్యాటర్ల మైండ్‌సెట్‌ని ముందుగానే అర్థం చేసుకుంటూ, ఫీల్డింగ్ మారుస్తూ.. బౌలర్లను ఛేంజ్ చేస్తూ..ఇలా ఏదీ చేసినా సరే ఆ ప్లాన్ 90శాతం సక్సెస్ అవ్వాల్సిందే. అందుకే ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ని డామినెట్ చేసిన బ్యాటర్లు కొద్దీమందే ఉంటారు. పొలార్డ్, మ్యాక్స్‌వెల్, సచిన్..ఇలా పలువురు ప్లేయర్లు చెన్నైని బోల్తా కొట్టించిన వాళ్లలో ఉండగా..మరో క్రికెటర్ సైతం ధోనీ గుండెల్లో దడ పుట్టించాడు.. చెన్నై జట్టుపై ఏకంగా సెంచరీ బాది మ్యాచ్ తర్వాత ధోనీతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఉన్నన్ని రోజులు ఐపీఎల్‌లో హిట్టింగ్ చేస్తూ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన పాల్ వాల్తాటి(Paul valthaty) తన క్రికెట్ కెరీర్‌కి వీడ్కోలు పలికాడు. అయితే ఐపీఎల్ ఫ్యాన్స్ పాల్ వాల్తాటిని చూసి చాలా కాలం ఐపోయింది. అతను ఆటకు దూరమై చాలా సంవత్సరాలు గడిచింది. 2011 ఐపీఎల్ సీజన్‌లో సెంచరీ బాదిన పాల్ వాల్తాటీ తర్వాత ఎక్కువగా ఎందుకు కనిపించలేదు..? పాల్ వాల్తాటి ధోనీ టీమ్‌కి చుక్కలు: 2011 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌ని అభిమానులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఆ మ్యాచ్‌తోనే పాల్ వాల్తాటి పేరు తెరపైకి వచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ సర్కిల్‌లో అతని పేరు మారుమోగింది. ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20ఓవర్లలో 188 పరుగులు చేసింది. మురళి విజయ్(74), బద్రినాథ్ (66),కెప్టెన్ ధోని (43) బ్యాట్ ఝళిపించడంతో భారీ స్కోర్ చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌కు స్టార్టింగ్‌లోనే షాక్ తగిలింది. గిల్‌క్రిస్ట్, షాన్ మార్ష్ త్వరగానే పెవిలియన్‌కి చేరడంతో జట్టు ఓనర్ ప్రతీ జింతా సైతం మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. ఈ ఇద్దరు బ్యాటర్లు లేకుండా 189పరుగులు చేయడం అసాధ్యమని అంతా భావించారు. పంజాబ్ డగౌట్‌లో కూడా విజయం మీద ఎవరికి ఆశలు లేవు. కానీ అక్కడే మ్యాచ్ ఊహించని మలుపులు తీసుకుంది. వచ్చాడు..బాదేశాడు: గిల్‌క్రిస్ట్, షాన్ మార్ష్ అవుట్ అవ్వడంతో చెన్నై బౌలర్లు కూడా మ్యాచ్‌ని కాస్త లైట్ తీసుకున్నారు.. గెలుస్తాంలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ చెన్నై బౌలర్లలో కనిపించింది. అయితే అలా అనుకున్న కొద్దీ సేపటికే వాళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ మార్స్ నుంచి భూమి మీదకు వచ్చేలా చేశాడు పాల్ వాల్తాటి.. చెత్త బంతులనే కాదు..మంచి బంతులను కూడా బౌండరీలు దాటించాడు. వీడేంటి ఇలా ఆడుతున్నాడని అనుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జోన్‌లో ఆడుతూ కనిపించిన వాల్తాటి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 63 బంతుల్లోనే 120 పరుగులు చేసి జట్టుకి ఊహించని విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తోనే అతని పేరు మారుమోగింది. వేధించిన గాయాలు: భవిష్యత్‌లో టీమిండియాకు ఆడి గొప్ప విజయాలు సాధిస్తాడనుకున్న పాల్ వాల్తాటీ కెరీర్‌ని గాయాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా కంటిగాయంతో అతని కెరీర్ ప్రమదంలో పడింది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ జట్లకు ఆడిన వాల్తాటి డమెస్టిక్ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. ఛాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా టీంకి, ఇండియా అండర్-19 జట్టుకి, ముంబై సీనియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు వాల్తాటి. ముంబై నుంచి వచ్చి ఐపీఎల్‌లో సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ వాల్తాటీ. ఆ తర్వాత సచిన్, రోహిత్ కూడా సెంచరీలు చేశారు. ఇలా కెరీర్‌లో ఆడిన ప్రతి జట్టుకు న్యాయం చేసిన వాల్తాటి తన క్రికెట్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి