unmarried boys: పాపం..ఆ ఊరిలో అందరూ పెళ్లి కాని ప్రసాదులే

పెళ్లంటే ముందేడు తరాలు.. వెనక ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలంటారు. అయితే.. ఓ గ్రామంలో ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో 50 ఏళ్లుగా ఆ ఊరిలో వివాహాలు అనేవి జరగటం లేదట.

New Update
unmarried boys: పాపం..ఆ ఊరిలో అందరూ పెళ్లి కాని ప్రసాదులే

unmarried boys: ప్రస్తుత కాలంలో చాలామంది యువతి యువకులకు ఇద్దరికీ పెళ్లి పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా లేరు. ఒకవైపు లవ్ మ్యారేజ్‌లు అయితే బాగానే జరుగుతున్నాయి కానీ.. అరేంజ్‌ మ్యారేజ్ అంటే చాలామంది కష్టంగా చేసుకుంటున్నారు. అయితే ఒక గ్రామంలో సమస్య చూస్తే అయ్యో పాపం అనిపించక తప్పదు. ఎక్కడైనా పెళ్లీడుకొచ్చిన వాళ్ళ పది నుంచి 15 మంది ఉంటారు. కానీ.. ఒక ఊరి సమస్య చూస్తే నిజంగానే అయ్యో పాపం అనే లా ఉంది. ఆ ఊరిలో మొత్తం పెళ్లి కాని ప్రసాద్‌లే ఉన్నారు. 50 సంవత్సరాల క్రిందట ఆ ఊరిలో పెళ్లి జరిగిందట. ఇంతవరకు మళ్లీ పెళ్లి జరిగిందే లేదు. మీరు విన్నది నిజమే.. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం ఆ ఊరికి వెళ్లాల్సిందే.

ఇది కూడా చదవండి: ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఏంటి..చైనీస్ ఫుడ్ తింటే ఏమౌతుంది..?

బీహార్‌లోని పాట్నాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైమూర్‌ జిల్లాలోని తహసీల్ అధౌరాలోని బర్వాన్‌కాలా ఊరు ఉంది. దీనిని బ్రహ్మచారి నగరం అని కూడా అంటున్నారు. ఇక్కడ మంగళ వాయిద్యాలు వినిపించి చాలా సంవత్సరాలు అవుతున్నాయి. ఇక్కడ యువకులకు బ్రహ్మచర్య నియమం అంటూ ఏమీ లేదు. అయినా.. సరే ఇక్కడ యువకులకు వివాహం జరగటం లేదు. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకడం లేదు.  మరో విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల పట్టణాలలోని అమ్మాయిలు ఈ ఊరి అబ్బాయిలని వివాహం చేసుకోవడానికి ముందుకురారు. 50 సంవత్సరాలగా ఎలాంటి పెళ్లి జరగలేదు. 2017 తరువాత ఇక్కడ ఓ వివాహం జరిగినట్టు సమాచారం ఉంది. అది కూడా ఆ ఊరిలో కాదు. మరో విచిత్రం ఏమిటంటే పెళ్లికి ముందే అబ్బాయి ఊరు విడిచి వెళ్లాలి. అతిథి గృహంలో బస చేయాలి. ఎందుకంటే ఈ ఊరిలో పెళ్లికి అవసరమైన సౌకర్యాలు ఉండవు. 2017 తర్వాత ఇక్కడ ఒక్క పెళ్లి కూడా జరగలేదు.  అయితే ఈ గ్రామంలోని అబ్బాయిలు వివాహం చేసుకోక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.

అసలు కారణాలు ఇవే..

భారతదేశ ఎంత అభివృద్ధి చెందినా.. కొన్ని ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఈ ఊరికి సరైన రోడ్డు మార్గం లేదు.  స్కూల్స్ లేవు, విద్యా వ్యవస్థ కూడా సరిగా లేవు, ఇక్కడున్న ప్రజలకి ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉన్నాయి. కనీసం తాగటానికి నీటి సౌకర్యం కూడా లేదు. త్రాగునీటి కోసం 1.5 కిలోమీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకుంటారట.   ఈ కారణాల వలన ఈ గ్రామ యువకులకు ఇంతవరకు పెళ్లి చేసుకోవడం లేదు. అయితే.. ఇలాంటి వెనుకబడిన ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే బీహార్ ప్రభుత్వం ఈ వసతులను కల్పించడంలో విఫలమైందనే చెప్పాలి.

Advertisment
తాజా కథనాలు