Caste Reservations Cancelled: బీహార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2023లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు వారు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన పాట్నా హైకోర్టు.. బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అవి రాజ్యాంగం అధికారాలకు అతీతమైనవి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని.. వాటిని రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
2023 నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ రిజర్వేషన్ సవరణ బిల్లును ఆమోదించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరు లేకుండానే రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. సవరించిన రిజర్వేషన్ కోటాలో షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 2 శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు 43 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులు ఉన్నాయి. ఈ నిర్ణయం ఓపెన్ మెరిట్ కేటగిరీ నుంచి వచ్చే వారికి 35 శాతానికి పరిమితం చేసింది.