Patel Ramesh Reddy: సూర్యాపేటలో నేను ఎందుకు గెలుస్తానంటే: పటేల్ రమేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

సూర్యాపేట నుంచి కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి విజయం సాధిస్తానని పటేల్ రమేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కూడా తనకు న్యాయం చేయలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Patel Ramesh Reddy: సూర్యాపేటలో నేను ఎందుకు గెలుస్తానంటే: పటేల్ రమేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
New Update

ఆఖరి నిమిషం వరకు సూర్యాపేట టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేసి భంగపడ్డ పటేల్ రమేష్‌ రెడ్డి (Patel Ramesh Reddy) సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. తనకు టికెట్ రాకుండా రాకుండా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  (Uttam Kumar Reddy) అడ్డుకున్నారని ఆరోపించారు. సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) అనుచరుడినైన నేను గెలిస్తే తనకు భవిష్యత్ లో ఇబ్బంది అవుతుందనే ఉత్తమ్ తనకు టికెట్ రానివ్వలేదన్నారు. గత ఎన్నికల్లో అధిష్టానం బుజ్జగింపులతో పోటీ చేయకుండా ఊరుకున్నానన్నారు. అయితే, ఈ సారి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ అధిష్టానంతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Telangana Elections: తెలంగాణలో ముగిసిన నామినేషన్‌ల స్వీకరణ గడువు.. 2,644 నామినేషన్లు..

రేవంత్ రెడ్డిని తాము నాయకుడిగా అనున్నామని.. కానీ ఆయన తమను అనుచరులుగా అనుకున్నట్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో చెప్పిన దామోదర్ రెడ్డి తనను మోసం చేశారని ఆరోపించారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తన భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 3 వేల ఓట్లతో ఓడిపోయిన చరిత్ర తనది అని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: Telangana: లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే..

ఇప్పటి వరకు తనతో కాంగ్రెస్ పెద్దలెవరూ తనతో మాట్లాడలేదన్నారు. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సూర్యాపేటలో రాజకీయ శూన్యత ఉందన్నారు. గత ఎన్నికల్లోనూ ప్రత్యామ్నాయం లేకపోవడం కారణంగానే మంత్రి జగదీశ్ రెడ్డి ఇక్కడ గెలిచాడన్నారు. రమేష్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

#telangana-elections-2023 #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe