Patanjali Ads: ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పతంజలి యాడ్స్(Patanjali Ads) ఉన్నాయనే కేసులో కోర్టుకు సమాధానం ఇవ్వడంలో రామ్‌దేవ్ బాబా(Ramdev Baba) విఫలమయ్యారని సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టుకు సమాధానమిచ్చింది పతంజలి సంస్థ. "తప్పుదారి పట్టించే ప్రకటనలకు కంపెనీ విచారాన్ని వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రకటనలు జారీ చేయబడకుండా మేము నిర్ధారిస్తాము," అంటూ పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఈరోజు సుప్రీంకోర్టుకు తెలియజేసారు. ఈ మేరకు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు.
కోర్టు ఆగ్రహం..
అంతకు ముందు తప్పుడు ప్రకటనలు చేసినందుకు పతంజలి ఉత్పత్తుల యాడ్స్ పై సుప్రీం కోర్లు పూర్తిగా నిషేదం విధించింది. గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ మళ్లీ అలాంటి యాడ్స్‌ను ప్రచారం చేడం మీద కోర్టు మండిపడింది. ఈ మేరకు పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలకు ధిక్కార నోటీసులను పంపించింది. పతంజలి పై కోర్టు దిక్కార పిటిషన్ మీద సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆయుర్వేద సంస్థ వ్యస్థాపకుల్లో ఒకరైన రామ్‌దావ్ బాబాతో పాటూ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కూడా కోర్టుకు హాజరు కావాలని సమన్లను జారీ చేసింది.
అసలు కేసు ఏమిటి?
ఫిబ్రవరి 27న, రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, ఊబకాయం వంటి ఇతర వ్యాధుల కోసం పతంజలి ఆయుర్వేదం ఉత్పత్తి చేసే మందుల ప్రకటనలను ప్రచురించకుండా సుప్రీంకోర్టు నిషేధించింది. పతంజలి ఆయుర్వేదం, ఆచార్య బాలకృష్ణలపై ధిక్కార నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2023లో, మెడికల్ ఎఫిషియసీ గురించి లేదా ఔషధ వ్యవస్థను విమర్శించడం గురించి ఎలాంటి ప్రకటనలు లేదా నిరాధారమైన వాదనలు చేయబోమని కంపెనీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. కానీ కంపెనీ తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది.
పతంజలి అఫిడవిట్ లో ఏముందంటే..
పతంజలి తన అఫిడవిట్‌లో, నవంబర్ 2023 తర్వాత విడుదల చేసిన ప్రకటనలు కేవలం “సాధారణ ప్రకటనలు” మాత్రమే కలిగి ఉన్నాయని, అయితే అనుకోకుండా “ఆక్షేపణీయమైన వాక్యాలను” చేర్చాయని పేర్కొంది. నవంబర్ 2023 నుండి సుప్రీం కోర్టు ఆదేశాలను గుర్తించని పతంజలి మీడియా విభాగం ప్రకటనలను క్లియర్ చేసింది అని చెప్పింది.
అలాగే, "భవిష్యత్తులో ఇటువంటి ప్రకటనలు విడుదల కాకుండా మేము నిర్ధారిస్తాము. పురాతన సాహిత్యం, ఆయుర్వేద పరిశోధనల మద్దతుతో అనుబంధంగా ఉన్న వస్తువులను ఉపయోగించడం ద్వారా జీవనశైలి వ్యాధులకు సంబంధించిన ఉత్పత్తులతో సహా రక్షణగా కాకుండా, పతంజలి ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ఈ దేశ పౌరులను ఆరోగ్యవంతంగా జీవించాలని ఉద్బోధించడమే దాని ఉద్దేశ్యమని స్పష్టం చేయడం ద్వారా డిపోనెంట్ వేడుకుంటున్నారు." అని అఫిడవిట్ పేర్కొంది.
Also Read: పెన్షన్ స్కీమ్ లో మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి!
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954 "ప్రాచీనమైనది". చట్టంలో చివరి మార్పులు 1996 లో జరిగాయి. అని కంపెనీ తెలిపింది. ఆయుర్వేదంలో శాస్త్రీయ పరిశోధనలు కొరవడినప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 ఆమోదించబడిందని పేర్కొంది.
"ప్రతి పౌరునికి మెరుగైన -ఆరోగ్యకరమైన జీవితం, జీవనశైలికి సంబంధించిన వైద్య సమస్యలకు సమగ్రమైన, సాక్ష్యం-ఆధారిత పరిష్కారాలను అందించడం ఆయుర్వేదం మరియు యోగా ద్వారా దేశంలోని ఆరోగ్య సంరక్షణపై భారాన్ని తగ్గించడం మా ఏకైక అన్వేషణ." సందర్భంగా కంపెనీ పేర్కొంది. "ఆయుర్వేద ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది, ఇది పురాతన సాహిత్యం/శాస్త్రీయ పరిశోధనల మద్దతుతో కూడిన విషయం" అని పతంజలి అఫిడవిట్ లో కోర్టుకు వివరించింది.