SP Rupesh : మెదక్ జిల్లా పటాన్ చెరు(Patancheru) సీఐ లాలూ నాయక్ పై సస్పెన్షన్(Suspension of CI Lalu Naik) వేటు పడింది. జిల్లా ఎస్పీ రూపేశ్(SP Rupesh) శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. గత నెల 24వ తేదీన పట్టణంలోని సాకి చేరువుపై అమీన్ పూర్(Ameenpur) కు చెందిన నాగేశ్వరరావు(Nageswara Rao) అనే వ్యక్తిపై దాడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు.
గత ఏడాది డిసెంబర్ 24వ తేదీని రాత్రి పటాన్ చెరులోని సాకిచెరువుపై అమీన్ పూర్ కు చెందిన నాగేశ్వర రావు వ్యక్తి పై దాడి కేసు లో నిర్లక్ష్యం వహించి ఆ వ్యక్తి మరణానికి కారణం అయ్యాడని సీఐ లాలూ నాయక్ పై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. మ్రుతిని కుటుంబ సభ్యులు ఇచ్చిన మిస్సింగ్ కేసు పై సమాచారం ఇచ్చిన పట్టించుకోక నిర్లక్ష్యం వహించాడని..FIR - 24/2024 అనుమానాస్పద కేసు గా నమోదు చేసి కూడా ఆ కేసుకు సంబంధించి పట్టించుకోలేదని లాలూ నాయక్ ను సస్పెండ్ చేశారు. సీఐ లాలు నాయక్ స్థానంలో ఇంఛార్జి సీఐ గా DI శ్రీనివాస్ రెడ్డి(DI Srinivas Reddy) కి బాధ్యతలు అప్పగించారు జిల్లా ఎస్పీ రూపేష్.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు.. ఆ విషయానికి కట్టుబడి ఉంటామని ప్రజలకు హామీ..!!