BIG BREAKING: కళ్లు చెదిరే రికార్డు ధర..రూ.20.5 కోట్లకు పాట్ కమ్మిన్స్ ను కొనుగోలు చేసిన SRH!

వరల్డ్‌కప్‌ విన్నింగ్ కెప్టెన్‌ పాట్ కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో పాట్‌ను కొనుగోలు చేసేందుకు బెంగళూరుతో పాటు SRH పోటి పడింది. చూస్తుంగానే వేలం కౌంట్‌ 20 కోట్లు దాటయగా.. చివరకు సన్‌రైజర్స్‌ పాట్‌ను దక్కించుకుంది.

New Update
BIG BREAKING: కళ్లు చెదిరే రికార్డు ధర..రూ.20.5 కోట్లకు పాట్ కమ్మిన్స్ ను కొనుగోలు చేసిన SRH!

రూ. 34 కోట్ల పర్సుతో ఆక్షన్‌లోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పెద్ద ఆటగాళ్లపై కన్నేసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ గెలవడంతో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారీ రికార్డు ధర పలికింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్ కమ్మిన్స్‌ను ఏకంగా రూ.20.5 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. అంతకముందు వరల్డ్‌కప్‌ హీరో ట్రావీస్‌ హెడ్‌ను రూ.6.8కోట్లకు దక్కించుకుంది.
RCB ప్రవేశించడానికి ముందు CSK -MI మధ్య బిడ్డింగ్ వార్ జరిగింది. కొంతకాలం తర్వాత, SRH టగ్ ఆఫ్ వార్‌లో చేరింది. ఆ తర్వాత RCB , SRH తీవ్రమైన బిడ్డింగ్ యుద్ధంలో హోరాహోరీగా తలపడ్డాయి. SRH అసలు వెనక్కి తగ్గలేదు. చివరికి కమిన్స్‌ను కైవసం చేసుకుంది. పాట్‌ కమిన్స్‌ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. 2020 వేలంలో అప్పటి రికార్డు మొత్తానికి రూ. 15.5 కోట్లకు KKR అతనిని సొంతం చేసుకుంది. కమిన్స్‌ను విడుదల చేసి, రెండు సీజన్‌ల తర్వాత దాదాపు మిలియన్ డాలర్లు (రూ. 7.25 కోట్లు) వెచ్చించి ఫ్రాంచైజీ తిరిగి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏకంగా రూ.20.5 కోట్లకు ప్యాట్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. 2022లో ముంబై ఇండియన్స్‌పై KKR తరఫున కమిన్స్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు, ఇది IPLలో సంయుక్తంగా రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. IPLలో 42 ఔటింగ్‌లలో, కమిన్స్ 8.54 ఎకానమీ రేట్‌తో పాటు 359 పరుగులతో 45 వికెట్లు సాధించాడు.

Also Read: సన్‌రైజర్స్‌కు వలర్డ్‌కప్‌ హీరో.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

Advertisment
Advertisment
తాజా కథనాలు