Passenger Vehicles: ఫిబ్రవరి నెలలో దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.8% పెరిగాయి. ఫిబ్రవరిలో దేశీయ, ఎగుమతులతో కలిపి మొత్తం అమ్మకాలు కూడా 23,03,322 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఫిబ్రవరి 2023లో ఇది 17,72,012 యూనిట్లుగా ఉంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ఈ గణాంకాలను విడుదల చేసింది. SIAM డేటా ప్రకారం, ఫిబ్రవరి 2023తో పోల్చితే 2024 ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాలు(Passenger Vehicles), ద్విచక్ర వాహనాలు, త్రి చక్ర వాహనాల అమ్మకాలు వృద్ధి చెందగా, వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గాయి.
ప్యాసింజర్ వాహనాలు(Passenger Vehicles) ఫిబ్రవరి 2024లో అత్యధిక విక్రయాలను నమోదు చేశాయి. దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు ఫిబ్రవరి 2024లో సంవత్సరానికి 10.8% పెరిగి 3,70,786 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3,34,790 యూనిట్లుగా ఉన్నాయి.
Also Read: సావరిన్ గోల్డ్ బాండ్స్ తో ప్రభుత్వానికి సూపర్ ప్రాఫిట్.. ఎలా అంటే..
ద్విచక్ర వాహనాల విక్రయాలు 35% పెరిగాయి..
ద్విచక్ర వాహనాల (Passenger Vehicles)విక్రయాలు ఫిబ్రవరిలో 35% పెరిగి 15,20,761 యూనిట్లకు చేరాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో 11,29,661 యూనిట్లు. గత ఏడాది ఫిబ్రవరిలో 50,382 యూనిట్లు ఉండగా, గత నెలలో మూడు చక్రాల వాహనాల పంపిణీ 8.3% పెరిగి 54,584 యూనిట్లకు చేరుకుంది.
దేశం బలమైన GDP వృద్ధి ఆటో రంగానికి సహాయపడింది..
SIAM అధ్యక్షుడు వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ, '2023-24 మూడవ త్రైమాసికంలో భారత్ బలమైన GDP వృద్ధి ఆటో రంగానికి సహాయపడింది. ఫిబ్రవరి 2024లో ప్రధానమంత్రి సమక్షంలో నిర్వహించిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 కూడా వినియోగదారులకు బలమైన సానుకూల సెంటిమెంట్‌ను సృష్టించింది. అందువల్ల, పరిశ్రమ దాని వృద్ధి వేగాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు.
ఫిబ్రవరిలో మొత్తం 22.94 లక్షల వాహనాల ఉత్పత్తి..
ఫిబ్రవరి 2024లో ప్యాసింజర్ వాహనాలు(Passenger Vehicles), ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్లు మరియు క్వాడ్రిసైకిల్స్ (చిన్న 4-వీలర్లు) మొత్తం ఉత్పత్తి 22,94,411 యూనిట్లుగా ఉందని SIAM తెలిపింది.