అది కేరళ(kerala)లోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం(airport).. బటిక్(Batik) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అప్పుడే ల్యాండ్ అయ్యింది. అందరూ కూల్‌గా తమ లగేజీతో వెళ్తుండగా.. ఒకడు మాత్రం కంగారుకంగారుగా నడుస్తున్నాడు. అతని ట్రాలీ(trolley) బ్యాగ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఫేస్‌లో టెన్షన్ క్లియర్‌గా కనిపిస్తోంది. ఎయిర్‌పోర్టు అధికారులకు ఇలాంటివి కొత్త కాదు. ఎక్స్‌ప్రెషన్ చూసి దొంగ ఎవడో.. ప్రయాణికుడెవడో.. ఈజీగా కనిపెట్టేస్తారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే గోల్డ్ స్మగ్లర్లు ఎయిర్‌పోర్టులో అడ్డంగా బుక్ అవుతారు. వీడు కూడా అలాంటోడే అని భావించిన అధికారులు.. అతడిని ఆపారు.. బ్యాగ్ ఓపెన్ చేసి చూశారు.. అందులో ఏముందో చూసి షాక్ అయ్యారు.
పాములు.. బల్లులు:
బ్యాగ్‌లో కచ్చితంగా గోల్డో..సిల్వరో.. లేకపోతే డైమండో ఉంటుందనుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బందికి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అక్కడే ఉన్న కొంతమందికి కడుపులో కూడా తిప్పింది..వాంతింగ్ సెన్‌సేషన్ కూడా వచ్చింది. ఎందుకంటే ఆ బ్యాగ్‌లో ఉన్నది బంగారం కాదు.. పాములు(snakes), బల్లులు(lizards)..! లగేజీ లోపల చిన్నచిన్న బాక్సుల్లో పాములు కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 47పాములు. అంతేకాదు.. బ్యాగ్‌లో రెండు బల్లులు కూడా దర్శనమిచ్చాయి.
ఎందుకు తీసుకొచ్చాడు?
తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్ నుంచి 47 పాములు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహమ్మద్ మొయిదీన్‌ను చూడగానే ఆఫీసర్లకు అనుమానం వచ్చింది. బటిక్ ఎయిర్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే కస్టమ్స్ అధికారులు మొయిదీన్‌ను అడ్డుకున్నారు. అతని బ్యాగ్ ఓపెన్ చేసిన అధికారులు, వివిధ రకాల, వివిధ పరిమాణాలతో ఉన్న పాములను చూశారు..ఆ బాక్సులకు చిన్న చిన్న చిల్లులు ఉన్నాయి.
మరోవైపు అటవీశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఆ పాములను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఇక దర్యాప్తులో భాగంగా మొయిదీన్‌ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అసలు ఇన్ని పాములు ఎందుకు తీసుకొచ్చినట్టు..? ఎవరికి అమ్మాలని తీసుకొచ్చాడు..? ఇంతకముందు ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చాడా? నిందితుడి కాల్ డేటా.. మెసేజీలు చెక్ చేస్తున్నారు. ఇక గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ ఏడాది మేలో చెన్నై ఎయిర్‌పోర్టులోనూ ఈ తరహా ఘటనే జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో నుంచి 22 పాములు, ఒక ఊసరవెల్లిని అధికారులు సీజ్ చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. నిజానికి కొంతమంది బడాబాబులు గుట్టుచప్పుడు కాకుండా తమ ఇంట్లోనే ఓ మినీ 'జూ'ని ఏర్పాటు చేసుకుంటున్నారు.. విదేశాల నుంచి పాములను.. ఇతర జంతువులను తెప్పించుకొని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ తరహా స్మగ్లింగ్ జరుగుతుందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.