Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్ మంజూరు..ఎన్నిరోజులంటే..?

సిర్సాలోని తన ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం ఆరోపణలపై రోహ్‌తక్‌లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు 30 రోజుల పెరోల్ మంజూరైంది.

Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్ మంజూరు..ఎన్నిరోజులంటే..?
New Update

లైంగిక దాడులు,హత్యలకు పాల్పడిన ఆరోపణలతో 20ఏళ్ల జైలు జీవితం గడుపుతున్న డేరా స్వచ్చ సౌదా చీఫ్, స్వయం ప్రకటిత ద్వైవం గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్కు గురువారం 30రోజుల పెరోల్ మంజూరు అయయింది. గురువారం సాయంత్రం ఐదుగంటలకు సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పత్ లోని బర్నావా ఆశ్రమానికి చేరుకున్నాడు.

publive-image

సిర్సాడేరాకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో బర్నావా ఆశ్రమానికి వెళ్లాడు. సిర్సా నుంచి డేరాబాబాకోసం గుర్రాలు, ఆవులను తెప్పించారు. అంతేకాదు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా గతేడాది జనవరిలో హర్యానా ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. ఇప్పుడు 30రోజుల పెరోల్ మంజూరు చేయడం ఇది రెండోసారి.

కాగా ఆగస్టు 15న డేరాబాబా పుట్టినరోజు. శిక్ష పడిన తర్వాత తొలిసారిగా జైలు బయట పుట్టినరోజు జరుపుకోనున్నాడు. గతేడాది 40రోజుల పెరోల్ పై వచ్చిన రామ్ రహీమ్...30 నెలల జైలు శిక్షలో ఇది ఏడోసారి పెరోల్ ముంజూరు అయ్యింది. రామ్ రహీమ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో రామ్ రహీమ్ కు ఎంతో మంతి అనుచరులు ఉన్నారు. వారు ఆయనను 'గాడ్‌మాన్' గా భావిస్తుంటారు, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించాలని..పలు కారణాలతో ఐదు వేర్వేరు సందర్భాల్లో పెరోల్ పై జైలు నుంచి విడుదలయ్యారు.
.
30 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ, అధికారులు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు అనేక షరతులు విధించారు, పెరోల్ వ్యవధిలో విడుదల వారెంట్‌లో పేర్కొనబడని ప్రదేశాన్ని సందర్శించడానికి జిల్లా మేజిస్ట్రేట్ (DM) ముందస్తు అనుమతి పొందాలనే షరతు కూడా ఉంది. పెరోల్ వ్యవధిలో రామ్ రహీమ్ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని...పోలీసులు, స్థానిక పరిపాలనతో సహకరించాలని పెరోల్ ఆర్డర్ ఆదేశించింది.

ఇద్దరు సాధ్విలను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ గుర్మీత్ రామ్ రహీమ్ కు 20ఏళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు. జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి,మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకేసులో జీవిత ఖైదు విధించగా...25 ఆగస్టు 2017 న రోహ్ తక్ లోని సునారియా జైలుకు తరలించారు. పంచాకులలోని సిబిఐ కోర్టుకు డేరా బాబా హాజరైన సందర్భంగా పెద్దెత్తున హింస చెలరేగింది. దీంతో ఆయనను హెలికాప్టర్ ద్వారా సునారియా జైలుకు తరలించారు అధికారులు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe