కొత్త పార్లమెంటు భవనంలో మూడో రోజు సమావేశాలు మొదలయ్యాయి. నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఈ రోజు చర్చ జరగనుంది. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. సాయంత్రం ఆరు గంటల వరకూ మహిళా బిల్లు మీద చర్చ జరగనుంది. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు.
-
Sep 20, 2023 19:45 ISTమహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదం
-
Sep 20, 2023 16:26 ISTమహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మేము ఇండియా అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం- ఆమ్ ఆద్మీ
-
Sep 20, 2023 15:22 ISTఇది మా బిల్లు అని మహిళలు గర్వంగా చెప్పుకుంటున్నారు- కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
-
Sep 20, 2023 15:16 IST15 ఏళ్లకే పరిమితం చేయొద్దు-వైసీపీ ఎంపీ సత్యవతి
-
Sep 20, 2023 14:13 ISTనా సీటు పోయినా పర్వాలేదు, మహిళా బిల్లును స్వాగతిస్తున్నా-కేటీఆర్
-
Sep 20, 2023 14:09 ISTఇప్పుడు బిల్లును అమలు చేయనప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారు-శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్
-
Sep 20, 2023 14:06 ISTమహిళా బిల్లు...ఇండియా కూటమి ఏర్పాటుకు పానిక్ రియాక్షన్ -జేడీ(యు) ఎంపీ రాజీవ్
-
Sep 20, 2023 13:31 ISTమహిళలను బీజేపీ ఫూల్స్‌ని చేస్తోంది: ఆప్ లీడర్
ఎన్డీయే ప్రభుత్వం తీసుకువస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. 'ఇది ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు.. మహిళలను పిచ్చోళ్లను చేసే బిల్లు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఇప్పుడు జరుగబోయేది కూడా అదే. బీజేపీ వారు తీసుకువచ్చిన మరో జుమ్లా బిల్లు ఇది. బిల్లు తీసుకురావడం శుభపరిణామలే. ఆప్ కూడా మద్ధతు ఇస్తుంది. అయితే, 2024 ఎన్నికల నుంచే దీనిని అమలు చేయాలి. దేశంలోని మహిళలు పిచ్చోళ్లు అనుకుంటున్నారా? మహిళా వ్యతిరేక బీజేపీ మరో బిల్లు తీసుకువచ్చింది. బిల్లు పేరుతో మరో అబద్ధపు నాటకాలాడుతోంది. దేశంలోని మహిళలు రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలను అర్థం చేసుకున్నాయి. 2024 ఎన్నికల్లో వారే తగిన బుద్ధి చెబుతారు.' అని వ్యాఖ్యానించారు సంజయ్ సింగ్.
-
Sep 20, 2023 13:31 ISTడీ లిమిటేషన్ కన్నా ముందు మహిళా బిల్లు అమలులోకి రానప్పుడు ఈప్రత్యేక సమావేశాలు ఎందుకు-ఎన్సీపీ లీడర్ సుప్రియా సూలె
-
Sep 20, 2023 13:29 ISTమహిళా రిజర్వేషన్ లో ఓబీసీ కోటా ఎందుకు ఉండకూడదో చెప్పాలి-బీహార్ సీఎం నితీష్ కుమార్
-
Sep 20, 2023 12:55 ISTమహిళా బిల్లు ఓ విప్లవాత్మక నిర్ణయం, దీనివల్ల జెండర్ ఈక్వాలిటీ సాధ్యమవుతుంది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
Sep 20, 2023 12:53 ISTరిజర్వేషన్ బిల్లు ప్రయోజనాలను పొందేందుకు మహిళలు 15-16 ఏళ్ళు వేచి ఉండాల్సిందే అన్న మాయావతి
-
Sep 20, 2023 12:51 ISTప్రధాని మోదీ ప్రభుత్వంలో మహిళాభివృద్ధి అద్భుతంగా జరిగింది-బీజెపీ ఎంపీ తేజస్వీ సూర్య
-
Sep 20, 2023 12:34 ISTఅట్టడుగు స్థాయి మహిళలు కూడా దీని ద్వారా లబ్ధి పొందాలని కోరుకుంటున్నా-జేఎంఎం ఎంపీ
-
Sep 20, 2023 12:30 ISTరిజర్వేషన్ బిల్లు మనుస్మృతి ముసుగులో ఉంది-ప్రకాష్ అంబేద్కర్
-
Sep 20, 2023 12:17 ISTమేము దేవతలం కాదు...మాకు అందరితో సమానంగా హక్కులు కావాలి-కనిమోళి
-
Sep 20, 2023 12:15 ISTమహిళా బిల్లుకు నారీ శక్తి వందన్ అని పేరు పెట్టడం పై మండిపడ్డ కనిమొళి
-
Sep 20, 2023 12:08 ISTడీ లిమిటేషన్ తర్వాతనే బిల్లు అమలు అనగానే నా హృదయం ముక్కలైంది -కనిమొళి
-
Sep 20, 2023 12:05 ISTమహిళా బిల్లు మీద మాట్లాడుతున్న డీఎమ్కే నేత కనిమొళి
-
Sep 20, 2023 11:43 ISTమహిళా బిల్లు కోటాలో ఓబీసీని కూడా చేర్చాలని డిమాండ్ చేసిన సోనియా గాంధీ
-
Sep 20, 2023 11:42 ISTబిల్లు వెంటనే అమలు అయ్యేలా చేయాలని కోరిన సోనియా
-
Sep 20, 2023 11:35 ISTమహిళా బిల్లుకు మద్దతునిస్తాం అని చెప్పిన సోనియాగాంధీ
-
Sep 20, 2023 11:22 ISTమహిళా బిల్లు మీద లోక్ సభలో చర్చ ప్రారంభించనున్న సోనియాగాంధీ
-
Sep 20, 2023 11:20 ISTమహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల-సోనియా గాంధీ
-
Sep 19, 2023 16:02 ISTరేపటికి వాయిదా పడిన రాజ్యసభ
-
Sep 19, 2023 16:01 ISTభారత్ ఐదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది-మోదీ
-
Sep 19, 2023 16:00 ISTదేశ నిర్మాణంలో మహిళలదే కీలక పాత్ర-ప్రధాని మోదీ
-
Sep 19, 2023 15:52 ISTముస్లిం మహిళలకు కోటా లేదు...అందుకే మేము బిల్లును వ్యతిరేకిస్తున్నాం-అసదుద్దీన్ ఓవైసీ
-
Sep 19, 2023 15:24 ISTపార్టీ కేంద్రీకృత విధానంపై రాజ్యసభ దృష్టి సారిస్తుంది- ప్రధాని మోదీ
-
Sep 19, 2023 15:16 ISTఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు, మర్చిపోలేనిది-రాజ్యసభలో ప్రసంగిస్తున్న మోదీ
-
Sep 19, 2023 14:42 ISTరేపటికి వాయిదా పడిన లోక్ సభ
-
Sep 19, 2023 14:39 ISTసరైన సమయం వచ్చేవరకు మహిళా బిల్లు మీద మాట్లాడను-రాహుల్ గాంధీ
-
Sep 19, 2023 14:25 ISTనారీ శక్తి వందన్ అధినీయం అని మహిళా బిల్లుకు పేరు
-
Sep 19, 2023 14:21 ISTలోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం కోట- ప్రధాని
-
Sep 19, 2023 14:20 ISTచట్టసభల్లో మహిళల ప్రాధాన్యం పెరగాలి- ప్రధాని
-
Sep 19, 2023 14:20 ISTమహిళా బిల్లును అందరూ ఆహ్వానించాలి- ప్రధాని
-
Sep 19, 2023 14:16 ISTమహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి దేవుడు నన్ను ఎన్నుకొన్నాడు-ప్రధాని మోదీ
-
Sep 19, 2023 14:13 ISTమహిళా బిల్లును ప్రకటించిన ప్రధాని మోదీ
-
Sep 19, 2023 13:55 ISTలోక్‌సభలో ప్రసంగిస్తున్న ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి
ప్రధాని మోదీ తర్వాత ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
-
Sep 19, 2023 13:53 ISTమహిళా రిజర్వేషన్ బిల్లు గతంలో చాలాసార్లు వచ్చింది: ప్రధాని
మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంతకుముందు చాలాసార్లు వచ్చిందని, అయితే బిల్లును ఆమోదించడానికి డేటా సేకరించలేదని ప్రధాని మోదీ అన్నారు.
-
Sep 19, 2023 13:52 ISTదేవుడు నన్ను పవిత్రమైన పని కోసం ఎన్నుకున్నాడు: ప్రధాని మోదీ
పవిత్రమైన పని కోసం దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ప్రధాని మోదీ అన్నారు. కొత్త పార్లమెంటు తొలి కార్యక్రమాలను మనం చూడబోతున్నాం.
-
Sep 19, 2023 13:51 IST2027 నాటికి మహిళల కోటా పూర్తి అమలు-ప్రధాని మోదీ
-
Sep 19, 2023 13:48 ISTఇది స్వాతంత్ర్య మకరందం: కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ
ఈ కొత్త పార్లమెంట్ భవనానికి మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ అవకాశం అపూర్వమైనది. ఇది స్వాతంత్ర్య మకరందం యొక్క వేకువ అని మోదీ అన్నారు.
-
Sep 19, 2023 13:41 IST’మిచ్చామీ దుక్కదాం’ అని దేశప్రజలకు చెప్పిన ప్రధాని మోదీ
జైన సంవత్సరాది సందర్భంగా ఎంపీలు, దేశప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ‘మిచ్చామి దుక్కాం’ అన్నారు. 'మిచ్చామి దుక్కడం' అనేది ప్రాకృత భాషా పదం. ఇందులో మిచ్చామి అంటే 'నన్ను క్షమించు', దుక్కడం అంటే 'చెడు పనులు'. సంవత్సరంలో ఇలా చెప్పడం ద్వారా, ప్రజలు గత సంవత్సరంలో తెలిసి లేదా తెలియక చేసిన తప్పు పనులకు క్షమించమని అడుగుతారు.
-
Sep 19, 2023 13:31 ISTకొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ
-
Sep 19, 2023 13:29 ISTభారతదేశం కొత్త సంకల్పంతో కొత్త పార్లమెంటు భవనానికి వచ్చింది: ప్రధాని మోదీ
కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కొత్త సంకల్పంతో భారతదేశం కొత్త పార్లమెంటు భవనానికి వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.
-
Sep 19, 2023 13:22 ISTకొత్త పార్లమెంట్ హౌస్‌లో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం
కొత్త పార్లమెంట్ భవనంలో జాతీయ గీతాలాపనతో పార్లమెంట్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
-
Sep 19, 2023 12:59 ISTకాలి నడకన కొత్త పార్లమెంట్ కు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. ఆయనతోపాటు ఎంపీలు పాత పార్లమెంట్ హౌస్ నుంచి కొత్త పార్లమెంట్ హౌస్ వరకు కాలినడకన ప్రయాణించారు.
-
Sep 19, 2023 12:55 ISTపాత పార్లమెంట్ భవనాన్ని 'సంవిధాన్ సదన్'గా పిలుస్తామన్న ప్రధాని మోదీ
-
Sep 19, 2023 12:38 ISTనేడు ప్రపంచం భారతదేశం యొక్క స్వావలంబన నమూనా గురించి మాట్లాడుతుంది: ప్రధాని మోదీ
స్వయం సమృద్ధి గల భారతదేశాన్ని తయారు చేయాలనే లక్ష్యాన్ని ముందుగా మనం నెరవేర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ప్రపంచం భారతదేశం యొక్క స్వావలంబన నమూనా గురించి మాట్లాడుతుందని ఆయన అన్నారు
-
{{ created_at }}{{ blog_title }}{{{ blog_content }}}