పార్లమెంట్(Parliament)పై దాడి చేయడమంటే చిన్నావిషయం కాదు. యావత్ దేశంపై దాడి చేసినట్టే. ఎంపీలను ఎన్నికున్నది ప్రజలే.. దేశానికి ప్రజాప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలే. అంటే అసెంబ్లీపై దాడి చేస్తే సంబంధిత రాష్ట్రంపై దాడి చేసినట్టే.. ఇక పార్లమెంట్‌పై దాడి అంటే దేశంపై దాడిగానే అభివర్ణిస్తుంటారు. పట్టబడ్డ వారు ఏ కారణంతో ఈ దాడికి పాల్పడ్డారో స్పష్టమైన క్లారిటీ లేదు కానీ.. ప్రభుత్వంపై నిరసనగానే ఈ చర్యకు దిగినట్టు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. చట్టప్రకారం నిరసనలు చేసుకునే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుంది. అయితే పార్లమెంట్‌పై తాజాగా జరిగిన దాడులు చట్ట వ్యతిరేకమే. అందుకే ఈ దాడికి పాల్పడ్డవారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు పోలీసులు.
దాడి చేసిన వారిపై పెట్టిన సెక్షన్ల లిస్ట్ ఇదే!
➼ ఐపీసీ సెక్షన్లు 120బి (నేరపూరిత కుట్ర).
➼ ఐపీసీ సెక్షన్ 452 (అతిక్రమం).
➼ ఐపీసీ సెక్షన్153 (అభ్యంతరంగా రెచ్చగొట్టడం, అల్లర్లు సృష్టించే ఉద్దేశం),
➼ ఐపీసీ సెక్షన్ 186 (ప్రభుత్వ విధులను నిర్వర్తించకుండా ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం),
➼ ఐపీసీ సెక్షన్ 353 (దాడి చేయడం)
పైన పేర్కొన్న ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు UAPA సెక్షన్లు కింద కూడా కేసు ఫైల్ చేశారు.
➼ UAPA సెక్షన్ 16 (ఉగ్రవాద చర్యకు శిక్ష)
➼ UAPA సెక్షన్ 18 (కుట్రకు శిక్ష)
జైల్లోనేనా?
ఈ కుట్రలో ఆరుగురికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు ప్రాంగణం లోపల గందరగోళం సృష్టించగా, మరో ఇద్దరు బయట అవాంతరాలు సృష్టించారు. మరో ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇప్పటివరకు మొత్తం ఐదుగురు అదుపులో ఉన్నారు. సాగర్ శర్మ, నీలం కౌర్, మనోరంజన్, అమోల్ షిండే, విక్కీ శర్మ, లలిత్ ఝాలు భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్‌కు చెందిన వారు. అయితే వీరి ప్రాంతాలు వేరు అయినా ఒకే ఆలోచన, భావజాలం కలిగి ఉన్న కారణంగా వీరంతా కలిశారు. సోషల్ మీడియాలో వీరికి పరిచయం ఏర్పడింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఐదుగురి నిందితుల విద్యా నేపథ్యంతో వారు గతంలో ఎలాంటి నిరసనలోనైనా పాల్గొన్నారా లాంటి విషయాల కూపీ లాగుతున్నారు. నిన్నటి(డిసెంబర్ 13)ఘటనకు ముందు వారు పార్లమెంట్‌ను సందర్శించారా లాంటి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read: పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనపై మోదీ సీరియస్.. మంత్రులతో ఏం అన్నారంటే?
WATCH: