Parliament Attack: భద్రతా ఉల్లంఘన ఘటన.. ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బంది సస్పెండ్‌!

లోక్‌సభ లోపల, వెలుపల స్మోక్‌ స్టిక్స్‌తో అలజడి రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని లోక్ సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది.

New Update
Parliament Attack: భద్రతా ఉల్లంఘన ఘటన.. ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బంది సస్పెండ్‌!

లోక్‌సభ ఇన్నర్‌లోకి ఇద్దరు.. పార్లమెంట్‌ ఆవరణలోకి ఇద్దరు.. బయట మరో ఇద్దరు.. ఇలా పార్లమెంట్‌లో అలజడి సృష్టించిన ఆరుగురిలో ఐదుగురు ఇప్పటికీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అసలు పటిష్ట భద్రత ఉండే పార్లమెంట్‌లోకి స్మోక్‌ స్టిక్స్‌తో ఎలా వచ్చారన్నదానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్‌లోనే సెక్యూరిటీ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్నదానిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

పార్లమెంట్‌లో జరిగిన భారీ సెక్యూరిటీ బ్రీచ్‌పై ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని లోక్ సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రవేశ ద్వారం, పార్లమెంట్ హౌస్ ఎంట్రీ ఏరియా సహా కీలకమైన యాక్సెస్ పాయింట్ల వద్ద సిబ్బంది మోహరించి ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించింది.

పార్లమెంట్‌ దాడి ఘటనలో ఐదో వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల అదుపులో లలిత్ ఝా ఉన్నాడు. ఆరో వ్యక్తి విశాల్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. పక్కా స్క్రిప్ట్ ప్రకారమే పార్లమెంటుపై దాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. దాడికి ముందు రోజు నలుగురు లలిత్ ఝా ఇంట్లో చర్చలు జరిపారు. ఆరుగురు ఒకరికొకరు తెలుసని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రెక్కీ కూడా నిర్వహించారని చెప్పారు. ఘటనపై విచారణ కోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సీఆర్​పీఎఫ్​ డీజీ నేతృత్వంలో కమిటీ విచారణ జరుపుతోంది. దాడి ఘటనపై ఉపా(UAPA) చట్టం కింద కేసు నమోదు చేశారు. మణిపుర్ సంక్షోభం, రైతుల నిరసనలు, నిరుద్యోగిత అంశాలతో నిరాశకు గురై ఈ ఘటనకు పాల్పడ్డామని దాడి లో పాల్గొన్న ఓ నిందితుడు చెబుతున్నాడు.

Also Read: అలా ఎలా అంటారు మేడం.. పీరియడ్ లీవ్ పై సెన్సేషనల్ అవుతున్న స్మృతి వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు