ఆ నలుగురు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు? పార్లమెంట్‌లోకి ఎందుకు చోరబడ్డారు? స్కోక్ స్టిక్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఎవరిపైనైనా దాడి చేసేందుకు వచ్చారా? ఈ నలుగురు వెనుక ఉన్నది ఎవరు? మాస్టర్‌మైండ్ ఎవరు..? ముందుకు నడిపించిందేవరు? లోక్‌సభ(LokSabha)లో భారీ భద్రతా ఉల్లంఘన జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికీ నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ నలుగురు ఎవరన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిర్బంధించబడిన నిందితుల్లో ఒకరికి జారీ చేసిన సందర్శకుల పాస్ ఇప్పటికే సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతొంది. పాస్‌లో నిర్బంధిత సాగర్ శర్మ పేరు ఉంది. మైసుర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరు మీద దీన్ని జారీ చేసినట్టు పాస్ చూస్తే అర్థమవుతోంది.
నిందితులు ఎవరంటే?
మనోరంజన్(కర్ణాటక-మైసూర్)
సాగర్ శర్మ(కర్ణాటక-మైసూర్)
నీలంకౌర్(హిస్సార్-హర్యానా)
అమోల్ షిండే(లాతూరు-మహారాష్ట్ర)
మనోరంజన్, సాగర్ ఇద్దరూ మైసురులో చదువుకుంటున్నారు. మైసూర్ వివేకానంద ఇనిస్టిట్యూట్‌లో సాగర్, మనోరంజన్ చదువుతున్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితం బెంగళూరు వెళ్తున్నామని చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయారు సాగర్, మనోరంజన్. ఇక పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సమగ్ర విచారణకు స్పీకర్ ఆదేశించారు. సిట్ ఏర్పాటు చేశారు. విజిటర్స్ పాస్‌లను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఘటనాస్థలం నుంచి ఆధారాలను ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది. విజిటర్స్ పాస్‌తో ఈ నలుగురు పార్లమెంటులోకి ప్రవేశించిన విషయం తెలిసిందే! కలర్‌స్మోక్ క్యాన్స్‌తో పార్లమెంట్ లోపలకు సాగర్, మనోరంజన్ ప్రవేశించగా.. పార్లమెంటు ఆవరణలోని ట్రాన్స్‌పోర్ట్ భవన్ వద్ద నీలం, అమోల్ షిండే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
లోక్ సభ భద్రతా ఉల్లంఘన ఎలా జరిగిందంటే?
జీరో అవర్ జరుగుతున్న సమయంలో ఇద్దరు చొరబాటుదారులు మధ్యాహ్నం ఒంటిగంటకు పబ్లిక్ గ్యాలరీ నంబర్ 4 నుంచి దూకారు. 'తానాషాహీ నహీ చలేగీ' (నియంతృత్వం అనుమతించబడదు) అంటూ నినాదాలు చేశారు. 2001లో పార్లమెంట్ దాడికి 22 ఏళ్లు పూర్తయిన రోజున ఈ ఘటనే జరగడం ప్రకంపనలు రేపింది. పాకిస్థాన్ ఆధారిత లష్కరే తోయిబా, జైష్-ఎ-మహ్మద్ సంస్థల ఉగ్రవాదులు పార్లమెంట్ కాంప్లెక్స్‌పై దాడి చేసి తొమ్మిది మందిని చంపారు. నాటి చేదు జ్ఞాపకాలను దేశం ఇంక మరవకముందే మన దేశం నుంచి పార్లమెంట్ లోపల దాడి జరగడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
Also Read: ఆహా.. ఓహో అన్నారు.. ఇదేనా పార్లమెంట్ భద్రత..? ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి?