/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/paritala-suneetha-jpg.webp)
Paritala Sunitha: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామన్న హామీని జగన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి ప్రయత్నించారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందంటూ ఐదు పేజీల లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయన ఆత్మహత్యకు యత్నించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుని పరామర్శించారు మాజీ మంత్రి పరిటాల సునీత. ఆత్మహత్యాయత్నం కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: నాదెండ్ల మనోహర్ అరెస్ట్.. పవన్ సీరియస్ వార్నింగ్..!
అనంతరం మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో మేలుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునే వరకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మల్లేష్ ఆత్మహత్యాయత్నం కు వేరే కారణాలు ఉన్నయంటారా అని మండిపడ్డారు. మీ సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also read: సీఎం ఇలాకాలో సీఐ పై దాడి.. ‘కేసు నమోదు చేయని ఎస్పీ’..!
వారం లోగా సిపిఎస్ రద్దు చేస్తా అన్న సీఎం జగన్ హామీ ఏమైంది? నెల నెల వేతనాలు ఎందుకు ఒకటవ తేదీ ఇవ్వడం లేదు? అని ప్రశ్నలు గుప్పించారు. వైసీపీ నాయకులు దోచుకున్న సొమ్ముతో సంతృప్తిగా ఉన్నారని.. ఉద్యోగులు, పింఛనర్లు అప్పుల పాలవుతున్నారని ధ్వజమెత్తారు. మల్లేష్ కు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అని దుయ్యబట్టారు.