Kanimoli: మీరు తినక పోతే మానేయండి..నేను తింటాను..కనిమొళి

చదువుకునే పిల్లలకు ఎలాంటి భేషాజాలు ఉండకూడదని..కుల వివక్ష అనేది మనసులో నాటుకోకూడదని ఆమె వారికి వివరించారు. అంతే కాకుండా ఆమె వంట మనిషికి కూడా పూర్తి భరోసా ఇచ్చారు. ఈ విషయం గురించి తెలుసుకున్న వారంతా ఆమె చేసిన పనికి ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Kanimoli: మీరు తినక పోతే మానేయండి..నేను తింటాను..కనిమొళి
New Update

తమిళనాడు ( Tamilanadu) లో డీఎంకే(Dmk) ఎంపీ(Mp) కనిమొళి (Kanimoli) చేసిన పనికి ప్రస్తుతం ఆమె అందరి నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది. అసలు ఆమె ఏం చేసింది..ఎందుకు అభినందనలు అందుకుంటున్నారు అంటే... రాష్ట్రంలోని ఉసిలంపాటి గ్రామంలో ఓ పాఠశాలలో ఓ దళిత సామాజికి వర్గానికి చెందిన మహిళ వంట చేస్తుంది. కానీ ఆ పాఠశాలలో ఉన్న అగ్ర వర్ణాల వారి పిల్లలు ఎవరూ కూడా ఆ వంట తినడం లేదు.

దీంతో ఆమె కొద్ది రోజుల నుంచి అన్ని వంటలు తగ్గించి చేస్తుంది. ఈ క్రమంలో ఆ పాఠశాలకు అధికారులు తనిఖీకి వచ్చారు. వారు కుకింగ్‌ సామాగ్రి అంతా అధికంగా ఉండటంతో ఆమెను ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని అధికారులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఒక దళిత సామాజిక వర్గానికి చెందినది కావడంతో ఆమె వంటను ఆ స్కూళ్లోని అగ్ర వర్ణాల వారు ఎవరూ కూడా తినడం లేదు.

ఇదే విషయాన్ని ఆమె అధికారులకు చెప్పడంతో ఆ విషయం కాస్తా డీఎంకే ఎంపీ కనిమొళి వద్దకు వెళ్లింది. దీంతో వెంటనే ఆమె రంగంలోకి దిగింది. సదరు పాఠశాలకు వెళ్లి ఆ వంట మనిషి వండిన ఆహారాన్ని ఆమె స్వయంగా పిల్లలతో కలిసి కూర్చొని తినడమే కాకుండా ఆమెనే స్వయంగా అందరికీ వడ్డించారు కూడా.

చదువుకునే పిల్లలకు ఎలాంటి భేషాజాలు ఉండకూడదని..కుల వివక్ష అనేది మనసులో నాటుకోకూడదని ఆమె వారికి వివరించారు. అంతే కాకుండా ఆమె వంట మనిషికి కూడా పూర్తి భరోసా ఇచ్చారు. ఈ విషయం గురించి తెలుసుకున్న వారంతా ఆమె చేసిన పనికి ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్‌ తో మాట్లాడిన అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారితో మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ '' ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో రోజుకు 15.75 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందజేస్తున్నారు.

#kanimoli #dmk
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి