Bhadrachalam: భద్రాచలంలో కొడుకును కడతేర్చిన తల్లిదండ్రలు..అసలు ఏం జరిగిందంటే..?

మద్యానికి బానిసయ్యాడని కొడుకును కడతేర్చారు తల్లిదండ్రులు. ఏకంగా సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును అంత మొందించారు. ఈ దారుణమైన ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది.

New Update
Bhadrachalam: భద్రాచలంలో కొడుకును కడతేర్చిన తల్లిదండ్రలు..అసలు ఏం జరిగిందంటే..?

Bhadrachalam: మద్యానికి బానిసయ్యాడని కొడుకును కడతేర్చారు తల్లిదండ్రులు. ఏకంగా సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును అంతమొందించారు. ఈ దారుణమైన ఘటన భద్రాచలం(Bhadrachalam)లో చోటుచేసుకుంది. తెలంగాణలోని భద్రాచలం మెడికల్‌ కాలనీకి చెందిన పగిల్ల రాము(Ramu), సావిత్రి(Savithri)ల కుమారుడు దుర్గాప్రసాద్‌(Durga Prasad) మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో తరుచూ గొడవ పడేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య మౌనిక(mounika) కూడా పుట్టింటికి వెళ్లిపోయింది.

తల్లిదండ్రులు పలుమార్లు తన పద్దతి మార్చుకొమ్మన్ని చెప్పిన దుర్గప్రసాద్ మాత్రం తన పద్దతి మార్చుకోలేదు. ఏకంగా ఇంటిని అమ్మేయాలని తల్లిదండ్రులను వేధించాడు. కొడుకు హింసిస్తున్నా సరే తల్లిదండ్రులు భరించారు. చాలా రోజుల పాటు తట్టుకున్నారు.. కానీ, చివరికి కొడుకు టార్చర్ భరించలేకపోయారు. సహనం నశించి కొడుకును అంత మొందించేందుకు కుట్ర పన్నారు. భద్రాచలానికే చెందిన రాజు, షేక్‌ ఆలీ పాషాలకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి కుమారుడి హత్యకు డీల్ కుదుర్చుకున్నారు.

పక్కా ప్లాన్ ప్రకారంగానే ఈ నెల 9న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుర్గాప్రసాద్‌ను గొంతుకోసి అతి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ఆటోలో ఏపీ సరిహద్దుల్లోని తుమ్మల నగర్ అటవీ ప్రాంతానికి తరలించారు. అనంతరం పెట్రోల్ పోసి డెడ్‌బాడీని తగులబెట్టారు. ఆ తర్వాత నలుగురు నిందితులు పరార్ అయ్యారు. ఈ నెల 10న మధ్యాహ్నం అటవీ ప్రాంతానికి పుల్లల కోసం వెళ్లిన వ్యక్తికి కాలిపోయిన శవం కనిపించింది. దీంతో ఎటపాక పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గప్రసాద్ హత్యపై దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ ఘడ్ ఒడిస్సా సరిహద్దుల్లో మృతుడి ఫోటోలతో కరపత్రాలు పంచారు. దుర్గప్రసాద్ ఫోటోను గుర్తించిన భార్య మౌనిక ఏపీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొడుకు ప్రవర్తనకు పూర్తిగా విసుగెత్తిన తల్లిదండ్రులు ఏకంగా సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును కడతేర్చారని పోలీసులు దర్యాప్తులో తేలీంది.

Also Read: మణిపూర్లో మరో దారుణం వెలుగులోకి…

Advertisment
Advertisment
తాజా కథనాలు