Parenting Tips: ఈ ఒక్క చిట్కా పాటించండి చాలు.. మీ పిల్లలు చక్కగా చదువుకుంటారు!

పేరెంట్స్‌ తమ పిల్లలను వేరే పిల్లలతో పోల్చుతారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించండి కానీ వారిపై ఒత్తిడి చేయవద్దు. చదువు నేర్పించాలనుకుంటే ముందుగా ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచండి. మరిన్ని టిప్స్‌ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Parenting Tips: ఈ ఒక్క చిట్కా పాటించండి చాలు.. మీ పిల్లలు చక్కగా చదువుకుంటారు!

తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఎంత కష్టంగా ఉన్నా వారిని మాత్రం పాఠశాలకు పంపుతారు. పిల్లల మంచి కెరీర్ అన్నిటికంటే ముఖ్యం. కోచింగ్‌తో పాటు కావాల్సిన అన్ని అవసరమైన వస్తువులను అందించడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను అన్ని విధాలుగా చదువుకునేలా ప్రోత్సహిస్తారు. ఇంత చేస్తున్నా పిల్లలకు చదువుపై ఆసక్తి లేకపోతే తల్లిదండ్రుల ఆందోళన పెరుగుతుంది. చాలా సార్లు తల్లిదండ్రులు చెబితే కానీ పిల్లలు చదువుకోవడానికి కూర్చొరు. ఒకవేళ అలా కూర్చున్నా చదువుపై దృష్టి పెట్టరు. ఆ సమయంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలను తిడతారు. లేకపోతే చదువు చదువు అని ఒత్తిడి తెస్తారు. అయితే తిట్టడం లేదా బలవంతంగా బోధించడం వల్ల పిల్లలకు చదువుపై ఆసక్తి పెరగదు. అందుకే కొన్ని పద్ధతులను తల్లిదండ్రులు తెలుసుకోవాలి. కొన్ని చిట్కాలతో పిల్లలను ఆటోమేటిక్‌గా చదువుపై ఆసక్తి పెరిగేలా చేయవచ్చు.

--> తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ ఉండాలి. పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి ప్రశంసలను ఆశిస్తారు. అయితే చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లలను వేరే పిల్లలతో పోల్చుతారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు.. అలా చేయవద్దు. ఇలా పోల్చడం పిల్లల మనోధైర్యాన్ని తగ్గిస్తుంది.

--> పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించండి కానీ వారిపై ఒత్తిడి చేయవద్దు. చదువు ఒత్తిడి పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో చదువులు భారంగా మారుతున్నాయి. వారిపై అధిక ఒత్తిడి తీసుకురావద్దు. చదువు గురించిన కష్టమైన విషయాలను కూల్‌గా వివరించడానికి ప్రయత్నించండి.

--> ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండాలి. మీరు పిల్లవాడిని ఏమీ అనకుండా చదువు నేర్పించాలనుకుంటే ముందుగా ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచండి. స్టడీ ఏరియాను సెటప్ చేయండి. పిల్లలు తమంతట తాముగా కూర్చుని చదువుకునే స్టడీ డెస్క్‌ని ఏర్పాటు చేసుకోండి.

Also Read: అశ్లీల కంటెంట్‌ ఉన్న 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం కొరడా.. ఏకంగా బ్యాన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు