Parenting Guide: వయస్సు ప్రకారం పిల్లల స్క్రీన్ టైమ్.. అది మించిందో ప్రమాదమే..!

మొబైల్స్ పిల్లల పెరుగుదల పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే పిల్లల వయస్సు ప్రకారం ఎంత స్క్రీన్ సమయం ఉండాలి..? స్క్రీన్ టైం పెరగడం వల్ల పిల్లలకు ఎలాంటి హానీ కలుగుతుంది..? అనే దాని పై పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

Parenting Guide: వయస్సు ప్రకారం పిల్లల స్క్రీన్ టైమ్.. అది మించిందో ప్రమాదమే..!
New Update

Parenting Guide: నేడు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ లేదా టీవీ ముందు గంటల తరబడి కూర్చున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. దీని కారణంగా షోషలైజ్ కాకపోవడమే కాకుండా అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే పిల్లల వయస్సు ప్రకారం ఎంత స్క్రీన్ సమయం ఉండాలి..? స్క్రీన్ టైం పెరగడం వల్ల పిల్లలకు ఎలాంటి హానీ కలుగుతుంది..? అనే దాని పై పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము

స్క్రీన్ సమయం అంటే ఏమిటి

స్క్రీన్ సమయం అంటే మీ పిల్లలు 24 గంటల్లో మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి గాడ్జెట్‌లను ఎంతసేపు ఉపయోగిస్తున్నారో ఆ సమయాన్ని స్క్రీన్ టైమ్ అంటారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా, వయస్సు ప్రకారం స్క్రీన్ సమయాన్ని ఉపయోగించుకోవడానికి నిర్దిష్ట వయోపరిమితి ఉంది. ఏది సరైన పరిమాణంలో ఉంటేనే ఆరోగ్యానికి మంచిది.

నిపుణులు ఏమంటున్నారు?

అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం, 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను స్క్రీన్ సమయం నుంచి దూరంగా ఉంచండి. లేదంటే పిల్లల భాష, జ్ఞానం, సామాజిక నైపుణ్యాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ వయసు పిల్లలకు పరిమితమైన వీడియో కాల్స్‌ను మాత్రమే అందించాలని నిపుణులు చెబుతున్నారు.

2-5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలను ఒక గంట కంటే ఎక్కువసేపు స్క్రీన్‌ని చూడనివ్వవద్దు. అయితే పిల్లలకు ఇచ్చే ఈ స్కిన్ టైమ్ కూడా ఇంట్లో పెద్దవారి పర్యవేక్షణలోనే ఇవ్వాలి. స్క్రీన్‌పై ఏమి జరుగుతుందో అతనికి ఎవరు అర్థమయ్యేలా చెప్పాలి. ఇంటరాక్టివ్‌ సెషన్ లా ఉండేలా చూసుకోవాలి.

5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్కిన్ టైమ్‌ని పాటించడానికి అకాడమీ ఎటువంటి ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించలేదు. కానీ ఇతర కార్యకలాపాలతో వారి స్క్రీన్ సమయం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం పిల్లల అభివృద్ధికి సహాయపడుతుంది.

publive-image

అధిక స్క్రీన్ సమయం కారణంగా హానికరమైన ప్రభావాలు

వర్చువల్ ఆటిజం

పిల్లలు ఎక్కువగా స్క్రీన్‌లకు గురికావడం వల్ల వర్చువల్ ఆటిజం అభివృద్ధి చెందవచ్చు. వర్చువల్ ఆటిజం అంటే మీ బిడ్డకు సహజంగా ఆటిజం లక్షణాలు లేకపోయినా, స్క్రీన్‌లకు ఎక్కువగా చూడడం వల్ల ఆటిజం లక్షణాలను అభివృద్ధి చేయవచ్చు.

భవిష్యత్తులో డిప్రెషన్, యాంగ్జయిటీ

స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్న పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ లక్షణాలు త్వరగా కనిపిస్తాయని ఇటీవలే పరిశోధనలో తేలింది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Baby Care : పిల్లల చెవిలో నూనె వేస్తున్నారా..? అయితే జాగ్రత్త ..! 

#parenting-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe