Oily Skin: ఈ పండుతో మీ జిడ్డు చర్మం దెబ్బకు వదులుతుంది.. ట్రై చేయండి!

రోజూ బొప్పాయిని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారు బొప్పాయిపండు ఒక వరం. ఇది ఆయిలీ స్కిన్ జిడ్డును పోగొట్టి, ముఖాన్ని అందంగా మార్చుస్తుందని నిపుణులు అంటున్నారు. పండిన బొప్పాయి, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ కలిపి ముఖం, మెడపై అప్లై చేసుకోవాలి.

New Update
Oily Skin: ఈ పండుతో మీ జిడ్డు చర్మం దెబ్బకు వదులుతుంది.. ట్రై చేయండి!

Oily Skin: బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉపయోగించడం ద్వారా జిడ్డు చర్మం, మొటిమలను వదిలించుకోవచ్చని అంటున్నారు. ఆయిలీ స్కిన్ జిడ్డును పోగొట్టి, ముఖాన్ని అందంగా మార్చుకోవాలంటే ఈ పండును ఖచ్చితంగా ఉపయోగించాలి. వేసవిలో ముఖం జిగటగా ఉంటుంది. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే జిడ్డుగల చర్మం ఉన్నవారికి ఇది ఆందోళన కలిగించే విషయం. జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి కొందరూ అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ వారు ఉపశమనం పొందలేరు. అయితే జిడ్డు చర్మాన్ని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

బొప్పాయితో లాభం:

జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారు రోజూ బొప్పాయి పండు ఒక వరం. ఇందులో ఉండే ఎంజైమ్‌ల వంటి పోషకాలు చర్మంలోని మురికిని శుభ్రపరచి, ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి బొప్పాయి దివ్యౌషధంలాగా పని చేస్తుంది.

బొప్పాయి- ముల్తానీమట్టి:

బొప్పాయి, ముల్తానీమట్టితో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దీనికోసం.. పండిన బొప్పాయిని చూర్ణం చేసి, అందులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ కలపాలి. దీన్ని బాగా మెత్తగా చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

బొప్పాయి-అలోవెరా:

బొప్పాయి- అలోవెరా ఫేస్ జెల్ చేయడానికి.. పండిన బొప్పాయి, అలోవెరా జెల్ రెండింటినీ బాగా మెత్తగా చేసి, రాత్రి నిద్రపోయే ముందు ఈ జెల్‌ను రాసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే చల్లని నీటితో కడగాలి. ఫేస్ ప్యాక్ కడిగిన తర్వాత.. ముఖంపై మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు. దీన్ని ప్రతిరోజూ చేయవచ్చు.

ముఖ్యమైన విషయం:

రోజూ బొప్పాయి తినవచ్చు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ముఖానికి బొప్పాయిని ఉపయోగించినప్పుడు.. బొప్పాయి పండినదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పండిన బొప్పాయిలో ఎక్కువ ఎంజైములు ఉంటాయి. కొందరికి దీనివల్ల అలర్జీ రావచ్చు. ఇది జరిగితే.. ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

ఇది కూడా చదవండి: డయాబెటిక్ పేషెంట్లు ఖాళీ కడుపుతో ఎగ్ బ్రెడ్ తినవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు