/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-24-2-jpg.webp)
Gold Shirt Pankaj Parakh: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చొక్కా భారతీయుడి దగ్గరే ఉంది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు పంకజ్ పరాఖ్ ఈ షర్ట్ కలిగి ఉన్నాడు. అంతేకాదు 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness World Record) చోటు సంపాదించడంతో వార్తల్లో నిలిచాడు. అతన్ని అందరూ సరదాగా 'ది మ్యాన్ విత్ ది గోల్డెన్ షర్ట్' (The Man With The Golden Shirt) అని పిలుస్తుంటారు.
బరువు 4.1 కిలోలు..
ఇది పూర్తిగా బంగారంతో తయారు చేయబడగా దాని బరువు 4.1 కిలోలు. బంగారు రంగులో కనిపించే ఈ చొక్కా పూర్తిగా ఫ్లెక్సిబుల్‌గా, సౌకర్యవంతంగా, శరీరానికి హాని కలిగించకుండా ఉంటుంది. మడతబెట్టి రుద్దినా పగిలిపోకుండా ఉండేందుకు లోపల ఒక సన్నని క్లాత్ ను కూడా దీనికి జతచేయించినట్లు పరాఖ్ తెలిపారు. దీని ధర రూ.98,35,099 (రూ.1.30 కోట్లు) ఉండగా వరల్డ్ లోనే రిచెస్ట్ షర్ట్ ధరించిన వ్యక్తిగా పరాఖ్ ఘనత సాధించాడు.
10 కిలోల బంగారు వస్తువులు..
అలాగే పరాఖ్ దగ్గర ఇంకా చాలా విలువైన వస్తువులున్నాయి. గోల్డ్ వాచ్, చైన్స్, ఉంగరాలు, మొబైల్ కవర్ అండ్ ఫ్రేమ్డ్ గ్లాసెస్ వంటి మొత్తం 10 కిలోల బంగారు వస్తువులున్నాయి (10 Kg Gold Items). ఈ ఖరీదైన వస్తువులన్నింటికి ప్రత్యేకమైన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులున్నారు. అంతేకాదు లైసెన్స్ రివాల్వర్ కలిగివున్న పరాఖ్ నడక తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇది కూడా చదవండి :International Mother Language Day: మాతృభాష అంటే సాంస్కృతిక వారధి.. దానిని కాపాడుకోవడం అందరి విధి..
రెండు నెలల పాటు తయారీ..
ఈ చొక్కాను నాసిక్‌లోని బఫ్నా జ్యువెలర్స్ డిజిఎం తయారు చేయగా.. ముంబైలోని శాంతి జ్యువెలర్స్ డిజైన్ చేసింది. 20 మంది కళాకారుల బృందం రెండు నెలల పాటు 3,200 గంటలు కష్టపడి చోక్కాను రూపొందించారు. ఈ అంగి కొనుగోలుకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేవు. ఇందుకు సంబంధించిన పూర్తి బిల్లులు కూడా ఉన్నాయని పరాఖ్ టీమ్ తెలిపింది.
ఇది నమ్మశక్యం కానిదే..
ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చొక్కా సొంతం చేసుకోవడంపై 47 ఏళ్ల పరాఖ్ సంతోషం వ్యక్తం చేశారు.. 'ఇది నమ్మశక్యం కానిదే. నేను మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఒక చిన్న మనిషిని. అయితే నేను సాధించిన ఈ విజయం నా పేరును ప్రపంచానికి పరిచయం చేసింది. నిజంగా ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది' అని చెబుతుంటాడు.
మంచి మనసున్న మనిషి..
8వ తరగతి వరకే చదువుకున్న పరాఖ్ (Pankaj Parakh).. కొన్నేళ్లుగా వ్యాపారం నడిపించాడు. వ్యాపారంలో విజయవంతం కావడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. యోలా పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ అయ్యాడు. అతని జీవనశైలి కాస్లీగా ఉన్నప్పటికీ పరాఖ్ చాలా పద్ధతిగా నడుచుకుంటాడు. అనేక దాతృత్వ కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ మంచి మనసున్న మనిషిగా మన్ననలు పొందుతుంటాడని స్థానికులు చెబుతుంటారు.