ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి సీనియర్ నేత

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు.

New Update
ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి సీనియర్ నేత

publive-image

జనసేనలో ఊపందుకున్న చేరికలు.. 

పవన్ కల్యాణ్‌ వారాహి యాత్రతో జనసేన పార్టీలో ఫుల్ జోష్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలోకి నేతల చేరికలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి స్వాములు జనసేన కండువా కప్పుకోగా.. తాజాగా మరో కీలక నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీలో జాయిన్ కానున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ..

మంగళగిరిలో పవన్‌తో పంచకర్ల భేటీ..

జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి తాను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నానని రమేష్ బాబు తెలిపారు. ఈ నెల 20వ తేదీన తన అనుచరులతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీలో జాయిన్ అవుతానని ప్రకటించారు. పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తానని.. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ఆత్మ గౌరవం దెబ్బతినటం వల్లే విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వైసీపీని వీడినట్లు వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించానని నిరూపిస్తే గొంతు కోసుకుంటానని పంచకర్ల స్పష్టంచేశారు.

ఆ కారణంగానే వైసీపీకి దూరం?

బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన రమేష్ బాబు 2009లో చిరంజీవి ఏర్పాటుచేసిన ప్రజారాజ్యం పార్టీ తరపున పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంనతరం కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం తర్వాత 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసిన వైసీపీలో చేరి విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నరమేష్‌బాబుకు వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు