Pan Aadhaar Link: పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వినియోగదారుల నుండి ప్రభుత్వం భారీగా డబ్బు సంపాదించింది. గడువులోగా తమ పాన్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయలేకపోయిన డిఫాల్టర్ల నుండి కేంద్ర ప్రభుత్వం ₹600 కోట్లకు పైగా పెనాల్టీగా వసూలు చేసింది. పాన్ - ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30, 2023. అయితే, అప్పటిలోగా పాన్ - ఆధార్ లింక్ చేయని వారిపై పెనాల్టీ విధిస్తోంది ప్రభుత్వం. ఇలా పెనాల్టీ ల ద్వారా వసూళ్లు చేసిన మొత్తం ఇప్పటివరకూ 600 కోట్లకు పైగా ఉంది.
ఇప్పటి వరకు దాదాపు ఇంకా 11.48 కోట్ల పాన్ నంబర్లను ఆధార్ కార్డుతో (Pan Aadhaar Link)అనుసంధానం చేయాల్సి ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది. "మినహాయింపు పొందిన వర్గాలను మినహాయించి, జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్‌ల సంఖ్య 11.48 కోట్లు" అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
వెయ్యిరూపాయలు పెనాల్టీ..
ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వుల ప్రకారం, గడువులోగా పన్ను చెల్లింపుదారులు తమ పత్రాలను ఆధార్‌తో లింక్ (Pan Aadhaar Link)చేయడంలో విఫలమైతే పాన్ కార్డులు పనిచేయవు. అంతేకాకుండా, అటువంటి పాన్‌కి సంబంధించి ఎలాంటి రీఫండ్స్ ఇవ్వరు. బయోమెట్రిక్ డాక్యుమెంట్‌తో పాన్‌ను లింక్ చేయడంలో విఫలమైతే TDS - TCS కూడా కట్ అవుతాయి. రూ. 1,000 ల లేట్ ఫీజ్ కట్టడం ద్వారా పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు పాన్-ఆధార్ లింక్ ఇంకా చేసుకోలేదా? అయితే, వెంటనే చేసుకోండి. దాని కోసం ఆన్ లైన్ ప్రాసెస్ తెలుసుకుందాం.
Also Read: బంగారం కొనాలంటే మంచి ఛాన్స్.. నిలకడగా ధరలు.. ఎంతంటే..
పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయడం ఎలా?
తమ పాన్ - ఆధార్‌ను ఇంకా లింక్(Pan Aadhaar Link) చేయని వారు గడువు ముగిసిన తర్వాత ₹ 1,000 జరిమానా చెల్లించి దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియ తర్వాత, పాన్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి దాదాపు ఒక నెల సమయం పడుతుంది. మీరు ఈ విధంగా పాన్‌ను ఆధార్‌కి లింక్ చేయవచ్చు.
- ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించండి: https://incometaxindiaefiling.gov.in/
- మీరు కొత్త వినియోగదారు అయితే, పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
- పెనాల్టీని చెల్లించడానికి, 'క్విక్ లింక్స్' కింద 'E-టాక్స్ చెల్లింపు' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత చలాన్ నంబర్/ITNS 280 కోసం చూడండి. ఆధార్-పాన్ లింకింగ్ రిక్వెస్ట్ కోసం కంటిన్యూ చేయండి
- ఒకే చలాన్‌లో మైనర్ హెడ్ 500 - మేజర్ హెడ్ 0021 <ఆదాయపు పన్ను (కంపెనీలు మినహా)> కింద పెనాల్టీని చెల్లించండి.
- మీకు ఇష్టమైన చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.
- మీ పాన్ వివరాలు- మీ చిరునామాను నమోదు చేయండి.
- క్యాప్చా కోడ్‌ని టైప్ చేసి కొనసాగండి.
- చెల్లించిన తర్వాత, మీ పాన్ వివరాలు, పాస్‌వ, పుట్టిన తేదీతో ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
- పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయమని అడుగుతున్న పాప్-అప్ విండో కనిపిస్తుంది. అలా కాకపోతే, 'మెనూ బార్'లో 'ప్రొఫైల్ సెట్టింగ్స్'లోకి వెళ్లి, 'ఆధార్ లింక్'పై క్లిక్ చేయండి.
- పాన్ కార్డ్‌లో పుట్టిన తేదీ, జెండర్ మొదలైన అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.
- ఆధార్‌లో ఇచ్చిన సమాచారంతో మీ సమాచారాన్ని ధృవీకరించండి.
- మీ సమాచారం సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, “లింక్ నౌ” బటన్‌పై క్లిక్ చేయండి.
- తరువాత, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని నిర్ధారిస్తూ పాప్-అప్ మెసేజ్ వస్తుంది.
Watch this Interesting Video :