/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/suicide-1-jpg.webp)
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇళ్లలోనే ఉండిపోతూ బాధపడుతున్నారు. 45ఏళ్ల రాజకీయ జీవితంలో స్కామ్ కేసుల్లో ఎన్నడూ కూడా జైలు జీవితం గడపని చంద్రబాబు.. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. ఇది ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఓ విషాద వార్తను పోస్ట్ చేసింది.
'తమ అభిమాన నాయకుడి అరెస్టు వార్త టీవీలో చూస్తూ ఆవేదనతో ఆగిన గుండె. చంద్రబాబు అరెస్ట్ వార్త తెలుసుకుని, పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన, టీడీపీ మైనారిటీ కార్యకర్త షేక్ హుస్సేన్ సాహెబ్ గుండెనొప్పితో మరణించారు. టీవీ చూస్తూనే, తీవ్ర ఆవేదనకు గురై ఒక్కసారిగా మంచం మీదనే కుప్పకూలిపోయారు. ఆయన మృతికి టిడిపి సంతాపం తెలియచేస్తుంది'. అని ట్విట్టర్‌లో టీడీపీ ఆఫిషియల్ అకౌంట్ పోస్ట్ చేసింది.
తమ అభిమాన నాయకుడి అరెస్టు వార్త టీవీలో చూస్తూ ఆవేదనతో ఆగిన గుండె. చంద్రబాబు గారి అరెస్ట్ వార్త తెలుసుకుని, పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన, టిడిపి మైనారిటీ కార్యకర్త షేక్ హుస్సేన్ సాహెబ్ గుండెనొప్పితో మరణించారు. టీవీ చూస్తూనే, తీవ్ర ఆవేదనకు గురై… pic.twitter.com/1Y9gCNYpF3
— Telugu Desam Party (@JaiTDP) September 11, 2023
ఇలా చేయవద్దు:
దయ చేసి ఎవ్వరూ ఆత్మ హత్యలు చేసుకోవద్దు అని టీడీపీ నేతలు కోరుతున్నారు. పబ్లిక్‌కి చెప్పండి ... ఒక టాల్ ఫ్రి నంబర్‌ఏర్పాటు చేయండి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆత్మ హత్యలు సొల్యూషన్ కాదు ట్వీట్లు చేస్తున్నారు. అయితే షేక్ హుస్సేన్ సాహెబ్ గుండెనొప్పితో మరణించారు. ఆత్మహత్య చేసుకోని కాదు.
మూడు రోజుల నుంచి ఇలానే జరుగుతున్నాయి:
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు అరెస్టు షాక్‌తో గుండెపోటుకు గురై సుమారు 13 మంది మృతి చెందగా, ఒక వ్యక్తి విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీ టెంకాయచెట్లపాలెం గ్రామానికి చెందిన వాయుల సుందరరావు(28) ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రబాబు పరిస్థితిపై తోటి గ్రామస్థులతో చర్చిస్తున్న సమయంలో సుందర్‌రావు మానసికంగా కుంగిపోయి ఆదివారం ఉదయం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అటు పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలం ఎస్ ఎర్రగుడి గ్రామానికి చెందిన పి.సుభాన్ అనే తెలుగుదేశం కార్యకర్త గుండెపోటుకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఇటు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌కు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబునాయుడు అరెస్టుతో కాసానికి గుండెపోటు వచ్చింది. అస్వస్థతకు గురైన కాసాని జ్ఞానేశ్వర్‌ను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ప్రత్యేక చికిత్స చేస్తున్నారు.
ALSO READ: చంద్రబాబు అరెస్ట్.. టీడీపీ లీగల్‌సెల్ ఐదు ఫెయిల్యూర్స్ ఇవే..!