Bigg Boss Winner Arrest: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్..

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కేసులో ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిపై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గజ్వేల్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రశాంత్ సోదరుడు రవిరాజును కూడా అరెస్ట్ చేశారు.

New Update
బిగ్ బాస్ విన్నర్ ర్యాలీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.!

Pallavi Prashant Arrest : బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌(Pallavi Prasanth) ను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కేసులో ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. గజ్వేల్‌ మండలం కొల్గూరులో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కాగా, ప్రశాంత్‌పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రశాంత్‌తో పాటు.. అతని సోదరుడు రవిరాజును కూడా అరెస్ట్ చేశారు. అతన్ని కూడా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season - 7) విన్నర్‌గా ప్రకటించిన తరువాత.. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయకు వచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే, అతను బయటకు వచ్చిన క్రమంలో అతని అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద నానా బీభత్సం సృష్టించారు. జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో బయట టీఎస్ఆర్టీసీ(TSRTC) కి చెందిన బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. రాళ్లతో దాడులు చేశారు. అంతేకాదు.. బిగ్ కంటెస్టెంట్‌ల వాహనాలను కూడా ధ్వంసం చేశారు ప్రశాంత్ అభిమానులు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు పలు ఫిర్యాదులు అందగా.. చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇప్పుడు పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు రవిరాజును అరెస్ట్ చేశారు.

Also Read:

అప్పుడెక్కడికి వెళ్లారు మీరంతా.. మీడియాకు రాహుల్ కౌంటర్..

టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే..

Advertisment
తాజా కథనాలు