/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Nimmala-Rama-Naidu-.jpg)
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 1983, 1994 ప్రభంజనానికి మించి భారీ విజయం సాధించిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి నిరంకుశ, నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించారన్నారు. ఈ గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా తామంతా కలిసి పని చేస్తామన్నారు. ఈ రోజు కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన సమయంలో నిమ్మల ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.