Rahat Fateh: దుబాయ్‌ ఎయిర్ పోర్టులో స్టార్ సింగర్ అరెస్ట్?

దుబాయ్‌ ఎయిర్ పోర్టులో అరెస్టు అయినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ స్టార్ సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్ కొట్టిపారేశాడు. మాజీ మేనేజర్ సల్మాన్ ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.

New Update
Rahat Fateh: దుబాయ్‌ ఎయిర్ పోర్టులో స్టార్ సింగర్ అరెస్ట్?

Pakistan: దుబాయ్‌ ఎయిర్ పోర్టులో అరెస్టు అయినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ స్టార్ సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్ కొట్టిపారేశాడు. మాజీ మేనేజర్ సల్మాన్  ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.

ఈ మేరకు గాయకుడు రహత్ ఫతే అలీ ఖాన్‌పై మాజీ మేనేజర్ సల్మాన్ అహ్మద్ పరువు నష్టం కేసు వేయడంతో అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసు వర్గాలు తెలిపినట్లు కథనాలు వెలువడ్డాయి. రాహత్ మాజీ మేనేజర్ అహ్మద్ అతనిపై దుబాయ్ అధికారులకు ఫిర్యాదు చేశారని, ఈ వివాదం నేపథ్యంలో కొన్ని నెలల క్రితం అహ్మద్‌ను రహత్ తొలగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు రాహత్, అహ్మద్ ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఇష్యూకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు