Pakistan in T20 World Cup: సూపర్ 8కి పాకిస్థాన్ చేరాలంటే ఇంకా చాలా స్టోరీ ఉంది! జరిగే పనేనా?

టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండిటిలో ఓడిపోయింది. తరువాత పాక్ - ఐర్లాండ్ మధ్య ఫ్లోరిడా లో జరగాల్సిన మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. 

New Update
Pakistan in T20 World Cup: సూపర్ 8కి పాకిస్థాన్ చేరాలంటే ఇంకా చాలా స్టోరీ ఉంది! జరిగే పనేనా?

Pakistan in T20 World Cup: 2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు చాలా కష్టాల్లో పడింది. అమెరికా.. టీమిండియా  చేతిలో ఓడిపోయిన తరువాత, కెనడాపై ఒక విజయాన్ని సాధించి కాస్త కుదుటపడ్డట్టు కనిపించింది. కానీ,  సూపర్-8కి అర్హత సాధించడానికి పాకిస్తాన్ ఇప్పుడు మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవవలసి ఉంది. దీంతో జట్టులో కాస్త ఆశలు చిగురించాయి. ఇప్పుడు దాని తదుపరి మ్యాచ్ ఫ్లోరిడాలో ఐర్లాండ్‌తో జరగాల్సి ఉంది.  కానీ, అంతకంటే ముందు పాకిస్థాన్ ముందు పెద్ద చిక్కు వచ్చి పడింది. నిజానికి పాకిస్థాన్ జట్టును మొదట అమెరికా ఇబ్బందుల్లోకి నెట్టింది. బాబర్ బృందం ఇంకా ముందుకు వెళ్లాలంటే మిగిలిన మ్యాచ్ ల్లో అమెరికా ఆటతీరుపై ఆధారపడి ఉన్నప్పటికీ, ఈసారి అసలు 

సమస్య అమెరికా కాదు, వర్షం పాకిస్థాన్ భవిష్యత్తును డిసైడ్ చేశేలా ఉంది. 

Pakistan in T20 World Cup: ప్రస్తుతం టోర్నీలో ముందుకు వెళ్లాలంటే, పాకిస్థాన్ జట్టు విజయం, అమెరికా ఓటమిపై పూర్తిగా ఆధారపడి ఉంది. కెనడాను ఓడించడం ద్వారా పాకిస్థాన్ ఈ దిశలో మొదటి అడుగు వేసాడు. ఇప్పుడు పాకిస్థాన్ తదుపరి మ్యాచ్ ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కు ఓ చేదు వార్త అందింది. ఫ్లోరిడాలో మరో వారం పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నందున దాని తదుపరి మ్యాచ్ వాష్ అవుట్ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూన్ 12న శ్రీలంక, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌ ఇందుకు ఉదాహరణగా నిలిచింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు కావాల్సి రావడంతో ప్రస్తుతం శ్రీలంక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయం అయిపోయింది. 

Also Read: తొలిసారి అమెరికాతో భారత్ పోటీ! ఏమవుతుందో?

పాకిస్థాన్ మ్యాచ్‌లో వర్షం పడితే ఏమవుతుంది?
పాకిస్థాన్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం 91 శాతం ఉంది. అంటే వర్షం కురువడం దాదాపు ఖాయం. ఇదే జరిగితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ పంచుతారు. దీంతో పాకిస్థాన్‌కు 3 పాయింట్లు వస్తాయి. మరోవైపు అమెరికా, భారత్‌లు 4 పాయింట్లతో గ్రూప్-ఎ పట్టికలో ఇప్పటికే నంబర్ వన్, టూ స్థానాల్లో ఉన్నాయి. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పాకిస్థాన్ ఔట్ అవుతుందని స్పష్టం అవుతోంది. అంటే, ఇప్పుడు పాకిస్థాన్ గెలుపు కంటే ముందు ఆట జరగాలని కోరుకోవాలి. వాన రావద్దని ప్రార్ధించాలి. అంతే!

Advertisment
తాజా కథనాలు