/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/pakistan-finance-minister-dar-got-angry-1.jpg)
పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఊరట లభించలేదు. $1.1 బిలియన్ల రుణాన్ని విడుదల చేయాలని నాయకులు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రయత్నం ఫలించలేదు. ఇదిలా ఉంటే, ఈ అంశంపై ఓ విలేకరి పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్‌ను ప్రశ్నించగా, ఆయన చెంపదెబ్బ కొట్టారు. గురువారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన అనంతరం ఇషాక్ దార్ బయటకు రాగానే ఈ ఘటన చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో జర్నలిస్టులు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) సహాయం గురించి ఆయనను ప్రశ్నలు అడుగుతున్నారు. IMF మేనేజింగ్ డైరెక్టర్‌తో ఇటీవల ప్రధానమంత్రి సమావేశానికి సంబంధించి ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నకు దార్ స్పందించలేదు. అందుతున్న సహాయానికి సంబంధించి ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమవడానికి కారణమేమిటని విలేకరి అడగడంతో దార్ తీవ్ర ఆగ్రహనికి లోనయ్యాడు.
No answers on economy, so will manhandle a journalist? #Pakistan Finance Minister #IshaqDar lost his cool with a reporter at the Parliament House on Thursday after being questioned about the completion of the stalled #IMF programme.@RDXThinksThat@InsightGL@kakar_harshapic.twitter.com/MDMgb8aAcC
— Afrah Shah (@afrahshah1) June 23, 2023
వ్యవస్థలో మీలాంటి వారు ఉండడం వల్లే ఇలా జరుగుతోందని అన్నారు. తాను వ్యవస్థలో భాగం కానని జర్నలిస్టు చెప్పడంతో ఆగ్రహించిన దార్ అతని మొబైల్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. జర్నలిస్టు తనను సెక్యూరిటీ గార్డు పట్టుకున్నాడని, దార్ తన చెంపదెబ్బ కొట్టాడని పేర్కొన్నాడు. పార్లమెంటరీ రిపోర్టర్స్ అసోసియేషన్ ఈ సంఘటనను ఖండించింది. జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పాలని దార్‌కు విజ్ఞప్తి చేసింది. దార్ క్షమాపణ చెప్పకుంటే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి నిరసన తెలుపుతామని సంఘం హెచ్చరించింది.