పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్,మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిది సోదరి చనిపోయారు. ఈ విషయాన్ని షాహీద్ అఫ్రిది(Shahid afridi) ధ్రువీకరించారు. తన సోదరి ఆరోగ్య పరిస్థితిపై నిన్న అఫ్రిది ట్వీట్ చేశారు. తనను చూడటానికి వెళ్తున్నానని పోస్టు పెట్టాడు. తన సోదరి ప్రాణాలతో పోరాడుతుందని చెప్పుకొచ్చారు. తన సోదరికి ఏమీ కాకూడదని అందరూ ఆ దేవుడిని ప్రార్థించాలని అభిమానులను కోరాడు అఫ్రిది.
అఫ్రిది ఇలా ట్వీట్ చేశాడు
'నా ప్రేమ(సోదరి) ఆరోగ్యంగా ఉండాలని నేను ఆమె దగ్గరకు వెళ్తున్నాను.. నా సోదరి ప్రస్తుతం తన జీవితం కోసం పోరాడుతోంది. ఆమె ఆరోగ్యం కోసం దువాస్ చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, అల్లాహ్ ని ప్రార్థించండి. ఆమె త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యకరమైన జీవితం ఇవ్వాలని దేవుడిని ప్రార్థించండి.' అని ట్వీట్ చేశాడు.
తిరిగి వస్తుండగా..:
అయితే అఫ్రిది ట్వీట్ చేసిన కాసేపటికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. అఫ్రిది జర్నీలో ఉండగా ఆయనకు ఈ మరణ వార్త అందింది. అనారోగ్యంతో ఉన్న తన సోదరిని చూసేందుకు ఆఫ్రిది వెళ్తుండగా.. ఆమె కన్నుమూసింది. తన సోదరి అంత్యక్రియలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతాయని సోషల్ మీడియాలో అఫ్రిది ప్రకటించాడు. ఇక ఈ విషాద వార్తతో పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా క్రికెటర్‌కు సంతాపం తెలిపారు.
అఫ్రిది అంటే పాకిస్థాన్ ప్రజలకు చాలా ఇష్టం. ఆయన కుటుంబాన్ని కూడా వారు గౌరవిస్తారు. క్రికెట్ వ్యవహారాలతో పాటు కుటుంబ విషయాల్లోనూ అఫ్రిదిని ఫాలో అయ్యే వారి సంఖ్య పాకిస్థాన్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన సోదరి మరణ వార్తతో అభిమానులు చాలా బాధపడుతున్నారు. అఫ్రిది తన కుమార్తేను స్టార్ క్రికెటర్ షాహీన్ అఫ్రిదికి ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. షాహీన్, అన్షాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కెప్టెన్ బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో సహా పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని షహీన్‌కి మంచి స్నేహితులు కొందరు వివాహానికి హాజరయ్యారు. షాహీన్ అఫ్రిది ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ బౌలింగ్‌ని లీడ్ చేస్తున్నాడు. అత్యుత్తమ బౌలర్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. ఇలా అఫ్రిది కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటోండగా.. ఉన్నట్టుండి అఫ్రిది సోదరి అనారోగ్యానికి గురవడం.. తాజాగా చనిపోవడంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ALSO READ: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డు వెనుక కారణం సచినే.. ఎలాగో తెలుసా?