PAK Vs BAN: పాకిస్థాన్ గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాక్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి మొదటిసారి పాక్‌పై టెస్టు సిరీస్ గెలిచింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో పాక్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ చేధించింది. ఓపెనర్లు జకీర్ హసన్ (40), షాద్మాన్ ఇస్లామ్ (24), నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్ (34), ముష్పీకర్ రహీమ్ (22*), షకీబ్ అల్ హసన్ (21*) బంగ్లాను విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో మీర్ హంజా, షాజాద్, అబ్రార్ అహ్మద్, ఆఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 274 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 262 రన్స్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు హసన్ మహ్మద్ (5/43), నహీద్ రాణా (4/44) పాక్ టాప్ అర్డర్ ను కూల్చడంతో 172కే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లిటన్ దాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
Also Read : దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..