Drug Supply: పైకేమో పాస్టర్ గెటప్..వెనుక నుంచి డ్రగ్స్ సప్లయ్..నైజీరియన్ ను పట్టుకున్న టీన్యాబ్!

పాస్టర్ గెటప్ లో డ్రగ్స్ దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగా దేశ వ్యాప్తంగా విస్తరింపచేసుకున్న డేవిడ్ ఉకా అనే నైజీరియన్ ముసుగును హైదరాబాద్ పోలీసులు తొలగించారు. అతడి దగ్గర్నుంచి పదిన్నర లక్షలు విలువ చేసే ఎక్స్ టసీ పిల్స్ అనే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక డేవిడ్ ఉకాను విచారిస్తున్న కాప్స్ ఎఫ్ఆర్ఆర్, ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి హైదరాబాద్ లో డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్న నైజీరియన్స్ ఇంకా సిటీలో ఉంటున్న ఓవర్ స్టేయర్స్ డీటైల్స్ ను సేకరిస్తున్నారు...

Drug Supply: పైకేమో పాస్టర్ గెటప్..వెనుక నుంచి డ్రగ్స్ సప్లయ్..నైజీరియన్ ను పట్టుకున్న టీన్యాబ్!
New Update

Drug Supply: పాస్టర్ గెటప్ లో డ్రగ్స్ దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగా దేశ వ్యాప్తంగా విస్తరింపచేసుకున్న డేవిడ్ ఉకా అనే నైజీరియన్ ముసుగును హైదరాబాద్ పోలీసులు తొలగించారు. అతడి దగ్గర్నుంచి పదిన్నర లక్షలు విలువ చేసే ఎక్స్ టసీ పిల్స్ అనే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక డేవిడ్ ఉకాను విచారిస్తున్న కాప్స్ ఎఫ్ఆర్ఆర్, ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి హైదరాబాద్ లో డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్న నైజీరియన్స్ ఇంకా సిటీలో ఉంటున్న ఓవర్ స్టేయర్స్ డీటైల్స్ ను సేకరిస్తున్నారు.

అసలు ఎవరీ డేవిడ్ ఉకా..బ్యాక్ గ్రౌండ్..!

2013 లో నైజీరియాకు చెందని డేవిడ్ ఉకా బిజినెస్ వీసా పై ఇండియాకు వచ్చాడు. కొన్నాళ్ల పాటు ఢిల్లీలో ఉన్నాడు. తరువాత బెంగుళూరుకు మకాం మార్చాడు. ఇక వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా బెంగళూరులో పేరు మార్చుకొని ఫేక్ వీసా సంపాదించాడు. అదే విధంగా ఫేక్ ఐడీలతో సిమ్ కార్డులు తీసుకొని డ్రగ్స్ దందాను స్టార్ట్ చేశాడు. బెంగళూరులోనే ఆల్ ఇండియా నైజీరియన్ స్టూడెంట్స్ కమ్యూనిటీ అసోషియేషన్ ను ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ గా ఉన్నాడు.

పాస్టర్ గా అవతారం..!

 ఇక తాను చేస్తున్న మాదక ద్రవ్యాల దందా బయటపడకుండా డేవిడ్ ఉకా పాస్టర్ అవతారమెత్తాడు. దీంతో తాను స్థాపించిన అసోసియేషన్ ద్వారా డ్రగ్స్, గంజాయి కేసుల్లో అరెస్ట్ అయిన నైజీరియన్లకు బెయిల్ ఇప్పించడం.. వాళ్లను తిరిగి దేశానికి పంపించడం లాంటి పనులు చేసేవాడు. దీంతో పాటు బెంగళూరు, హైదరాబాద్ లోని నైజీరియన్ స్టూడెంట్స్, టూరిస్ట్, హెల్త్ వీసాలపై వచ్చిన వారికి అవసరమైన హెల్ప్ చేసేవాడు. ఇక ఇలా తన ద్వారా సహాయం పొందిన వారితోనే సోషల్ మీడియాలో గ్రూపులను క్రియేట్ చేయించి బెంగుళూరు అడ్డగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కు మాదకద్రవ్యాలను సప్లయ్ చేయించేవాడు.కాని కస్టమర్లు ఇంకా పెడ్లర్లతో మాత్రం అతనే కాంటాక్ట్ లోనే ఉండేవాడు. ఇంటర్నేషనల్, వాట్సాప్ కాల్స్ ద్వారా దందాను నడిపేవాడు.

హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా..!

బెంగుళూరు తరువాత నిందితుడు హైదరాబాద్ ను తన దందాకు అడ్డాగా మార్చుకున్నాడు. బెంగుళూరులోని బెదరకల్లి షెల్టర్ నుంచి హైదరాబాద్ లోని పెడ్లర్లకు డ్రగ్స్ అందించేవాడు. కాగా, ఈ నెల 7న ఫిలింనగర్ లో ఆరుగురు నైజీరియన్లను టీన్యాబ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాళ్ల దగ్గర్నుంచి కోటి విలువ చేసే 100 గ్రాముల కొకైన్, 300 గ్రాముల ఎమ్ డీఎమ్ ఏ సీజ్ చేశారు. ఇక వారి వాట్సాప్ చాటింగ్, కాల్ డేటా ఆధారంగా డేవిడ్ ఉకాను గుర్తించారు. అతడి పై నిఘాను పెట్టారు. ఈ క్రమంలో అతడే హైదరాబాద్ కు వస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో ఫిల్మ్ నగర్ వచ్చిన డేవిడ్ ఉకాను డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి