Aluminum Foil Side Effects: ఆహారాన్ని చాలా మంది ప్యాక్ చేసేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించడం సర్వసాధారణం. అల్యూమినియం ఫాయిల్ సహాయంతో సులభంగా ఆహారాన్ని నిల్వ చేయవచ్చు, టిఫిన్‌లో తీసుకెళ్లవచ్చు. కానీ మీకు తెలుసా అల్యూమినియం ఫాయిల్ కూడా కొన్ని నష్టాలు ఉన్నాయని. అయితే అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తాయని కొందరి మనస్సులో ఉంటుంది. అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించడం సరైనదా కాదా అనే విషయం గురించి ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఈ రోజు అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రభావం గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అల్యూమినియం ఫాయిల్ వల్ల కలిగే ప్రభావాలు:
- అల్యూమినియం ఫాయిల్ మంచి కండక్టర్. కాబట్టి ఇది ఆహారాన్ని వెచ్చగా ఉంచుతుంది. మార్కెట్‌లో తక్కువ ధరకు సులభంగా పొందవచ్చు. ఆహారాన్ని ప్యాకింగ్ చేయడమే కాకుండా ఇతర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు.
- అల్యూమినియం ఫాయిల్ ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అల్యూమినియం ఫాయిల్‌లో ఏదైనా ఆహార పదార్థాన్ని ప్యాక్ చేసినప్పుడు వేడి ఉష్ణోగ్రత వల్ల అల్యూమినియం అన్ని ఆహార పదార్థాలలో కలగవచ్చు. ఇలా జరిగి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అల్యూమినియం ఫాయిల్‌తో స్పర్శించడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్ వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది
- అల్యూమినియం ఫాయిల్ ఆమ్ల ఆహారాలకు ప్రమాదకరం. అది తింటే రుచి, నాణ్యత రెండూ పాడవుతాయి. అల్యూమినియం రేకును ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పుల్లని వస్తువులను నిల్వ చేయడానికి అల్యూమినియం రేకును ఉపయోగించవద్దు.
- చాలా వేడి ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేయకూడదు. ఇలా చేస్తే అల్యూమినియం ఆహారంలో కలిసిపోయి రోగాలు రావచ్చు. అల్యూమినియం ఫాయిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించకూడదు. మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అల్యూమినియం ఫాయిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.