Mental Health: ఇలాంటి లవర్‌ ఉంటే తలపోటు తప్పదు.. అయినా నో టెన్షన్‌..ఈ టిప్స్‌ పాటించండి..!

కొంతమంది తెలియకుండానే టాక్సిక్‌ రిలేషన్‌లో చిక్కుకుంటారు. అలాంటివారు డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే సమస్యను గుర్తించడం, వైద్య నిపుణుడి సహాయం కోరడం, ప్రొఫెషనల్ లీగల్ అడ్వైస్, స్వీయ సంరక్షణ లాంటి వాటితో మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు. బ్యాడ్‌ రిలేషన్స్‌లో ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.

New Update
Mental Health: ఇలాంటి లవర్‌ ఉంటే తలపోటు తప్పదు.. అయినా నో టెన్షన్‌..ఈ టిప్స్‌ పాటించండి..!

కొంతమంది లవ్‌(Love)కు ముందు ఒకలా.. లవ్ తర్వాత ఒకలా ఉంటారు. లవ్‌ ఒప్పుకున్న తర్వాత పూర్తిగా మారిపోతారు. అసలు రంగు బయటపెడతారు. అప్పుడు టార్చర్ మొదలవుతుంది. మెంటల్‌ ఎక్కుతుంది. ఒకవేళ మీరు ప్రేమించిన వాళ్లు మంచివాళ్లు కాకపోతే అప్పుడు మీ మానసిక సమస్యలు(mental health problems) పెరుగుతాయి.. బ్యాడ్‌ లవర్‌ మీ మెంటల్‌ హెల్త్‌ని ఎలా డ్యామేజ్‌ చేస్తుందో తెలుసుకోండి.

స్ట్రెస్‌ అండ్‌ ఎంగ్జైటీ: పదేపదే గొడవలు పడడం, ఎమోషనల్‌గా వేధింపులకు గురి అవ్వడం లాంటివి జరుగుతుంటే తెలియకుండానే మీ బ్రెయిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఎంగ్జైటీకి దారి తీస్తుంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

ఆత్మగౌరవం తగ్గుతుంది: బ్యాడ్‌ లవర్‌తో రిలేషన్‌లో కంటిన్యూ అవుతున్న కొద్ది మీరు సెల్ఫ్‌ వ్యాల్యూను కోల్పోతారు. ఇది ఆత్మగౌరవం తగ్గేలా చేస్తుంది. మనం ఏమీ చేయలేమన్న అసమర్థత భావాలకు దారి తీస్తుంది.

డిప్రెషన్‌: టాక్సిక్‌ రిలేషన్‌లో ఉండడం వల్ల కొన్నాళ్లకు అది డిప్రెషన్‌ వైపు దారి తీసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదే పనిగా బాధలో ఉండిపోతారు. జీవితంపై హోప్ లేకుండా ఉంటుంది.

ఒంటరితనం: చెడు సంబంధాలలో ఉన్న కొందరు వ్యక్తులు స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియకుండానే దూరం ఐపోతారు. ఇది సామాజిక ఒంటరితనానికి దారితీస్తుంది. ఇది మానసిక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

ఇలాంటి ఎన్నో సమస్యలు బ్యాడ్‌ లవర్‌ వల్ల వస్తాయి. ఇవే కాదు.. ఇంకా చాలానే ఉన్నాయి. మరి వీటి నుంచి ఎలా విముక్తి పొందాలి? ఈ టిప్స్‌ తెలసుకుంటే అవి మీకు ఉపయోగపడవచ్చు.

సమస్యను గుర్తించండి: మొదటగా మనం టాక్సిక్‌ రిలేషన్‌లో ఉన్నామని గుర్తించుకోవడం ముఖ్యం. మీ బ్యాడ్‌ లవర్‌ మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని గుర్తించండి. ఇది చికిత్స వైపు మొదటి అడుగు.

నిపుణుడి సహాయాన్ని కోరండి: రిలేషన్‌షిప్స్‌తో పాటు మానసిక ఆరోగ్యంలో నైపుణ్యం కలిగిన థెరపిస్ట్ లేదా కౌన్సెలర్‌తో మాట్లాడడాన్ని కన్సిడర్‌ చేయండి. వారి మద్దతు మీకు అవసరం.

publive-image ప్రతీకాత్మక చిత్రం

స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి: ఇలాంటి వారికి ఎమోషనల్‌ సపోర్ట్ అవసరం. మీకు నచ్చిన ఫ్రెండ్స్‌ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేయండి.

సరిహద్దులను సెట్ చేయండి: ఇది అన్నిటికంటే ముఖ్యం. మన మానసిక సమస్యలకు కారణం అవుతున్న వాళ్లతో లిమిట్‌లో ఉండండి. అవసరం అయితే వారిని పూర్తిగా అవైడ్ చేయండి. అలాంటివారితో ఎంతలో ఉండాలో అంతలో ఉండడం అన్నిటికంటే ముఖ్యం.

స్వీయ సంరక్షణ: మానసిక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే స్వీయ-సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇందులో వ్యాయామం, ధ్యానం, జర్నలింగ్‌తో పాటు మీ హాబీలు ఉంటాయి.

ప్రొఫెషనల్ లీగల్ అడ్వైస్: అవసరమైతే లీగల్‌గా ప్రోసిడ్‌ అవ్వండి. అయితే ఎక్కువ టెన్స్‌ తీసుకోవద్దు.

ఎలాంటి మానసిక సమస్యలకైనా సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.. గమనించగలరు.

ALSO READ: ఇలా చేస్తే దెబ్బకు డెంగీ పరార్‌.. ఈ చిట్కాలతో దోమలకు దబిడి దిబిడే..!

Advertisment
తాజా కథనాలు