Bye Elections: దేశ వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి దూసుకుపోతోంది. 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. పంజాబ్లోని జలంధర్లో 37,325 ఓట్ల తేడాతో AAP అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీఎంసీ 4 స్థానాల్లో, బీజేపీ, డీఎంకే, జేడీయూ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీహార్ లోని రూపాలిలో ఇండిపెండెంట్, హిమాచల్లోని హమీరుర్లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా, నలాగఢ్ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగ్లౌర్, మధ్యప్రదేశ్‌లోని అవార్వారా స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్తలా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉంది. పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ స్థానంలో ఆప్ విజయం సాధించింది. బీహార్‌లోని రూపాలీ స్థానంలో జేడీయూ ఆధిక్యంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. తమిళనాడులోని విక్రవాండి స్థానంలో డీఎంకే ముందంజలో ఉంది.