Osmania University: ఉస్మానియాలో దూరవిద్యా కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానం

ఓయూలో దూరవిద్యా కోర్సుల్లో 2వ ఫేజ్ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. వివిధ డిగ్రీ కోర్సులతో పాటు పీజీ, పీజీ డిప్లోమా కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Osmania University: ఉస్మానియాలో దూరవిద్యా కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానం
New Update

ఉస్మానియా యూనివర్సిటీలో దూరవిద్యా కోర్సుల్లో రెండవ ఫేజ్‌ ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఓయూ డైరెక్టర్ ప్రొ.జీబీ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. వివిధ డిగ్రీ కోర్సులతో పాటు పీజీ, పీజీ డిప్లోమా కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ ను సందర్శించాలని సూచనలు చేశారు.

పీజీ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సైకాలజీ), ఎంకామ్‌, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌)

డిగ్రీ కోర్సులు: బీఏ, బీకాం జనరల్‌, బీబీఏ, బీఏ (మ్యాథ్స్‌ & స్టాటిస్టిక్స్‌)

పీజీ డిప్లొమా కోర్సులు (ఒక సంవత్సరం కోర్సు): మ్యాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌

#osmania-university #telugu-news #distance-education
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe