పీయూష్ గోయల్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు...!

రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ పై విపక్ష ఇండియా కూటమి నేతలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేతలను ‘ద్రోహులు’అని ఆయన నిందించడాన్ని తాము తప్పుబడుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. అందువల్ల పీయూష్ గోయెల్ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.

author-image
By G Ramu
పీయూష్ గోయల్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు...!
New Update

రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ పై విపక్ష ఇండియా కూటమి నేతలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేతలను ‘ద్రోహులు’అని ఆయన నిందించడాన్ని తాము తప్పుబడుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. అందువల్ల పీయూష్ గోయెల్ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.

ఆ కొద్ది సేపటికే జైరాం రమేశ్ మరో ట్వీట్ చేశారు. పరస్పర చర్చల తీర్మానం ఆధారంగా మణిపూర్‌పై తక్షణ చర్చకు అనుమతించేందుకు మోడీ సర్కార్ నిరాకరిస్తోందన్నారు. అందుకే ఈ రోజు సభ నుంచి విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు వాకౌట్ చేశాయన్నారు. విపక్ష నేతలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పేందుకు పీయూష్ గోయల్ పదే పదే తిరస్కరించడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు.

అనంతరం పీయూష్ గోయల్ మాట్లాడుతూ.... కాంగ్రెస్, దాని సంకీర్ణ పార్టీలు చైనా మీడియాకు మద్దతు పలుకుతున్నాయని విమర్శించారు. దేశంలో విపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని చెప్పారు. ఇది చాలా సీరియస్ అంశమన్నారు. ఈ విషయంపై సభలో సుదీర్ఘ చర్చ జరగాలన్నారు. దురహంకార విపక్ష పార్టీలు ఒక దాని కొకటి సహకరించుకుంటున్నాయన్నారు.

దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి ఫండింగ్ చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాహుల్ గాంధీకి కమ్యూనిస్టు పార్టీ, చైనాకు ఉన్న సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. విపక్షాలు భారత్ తో వుంటాయా లేదా చైనా వైపు ఉంటాయా అనే విషయాన్ని ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటానున్నారని చెప్పారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి