Oscars 2024: ఆస్కార్.. ప్రపంచంలో సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కల కనే అవార్డు. ఆస్కార్ అవార్డు(Oscars 2024) విన్నర్ అంటే ఆ ప్రత్యేకతే వేరు. నటుల దగ్గర నుంచి సాంకేతిక నిపుణుల వరకూ ఆస్కార్ అవార్డు వస్తే చాలు.. తమ కష్టం ఫలించింది అనుకుంటారు. నిజానికి కొన్ని దేశాల్లో ఆస్కార్ అవార్డుల కోసమే సినిమాలు తీసే దర్శక, నిర్మాతలు కూడా ఉన్నారంటే దాని విలువ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ప్రతి ఏటా నిర్వహించే ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో అతిథిలా పాల్గోవడం కూడా గొప్ప గౌరవంగా ప్రపంచ సినీ పరిశ్రమలోని అందరూ భావిస్తారు. మన దేశంలో ఆస్కార్ గురించి సాధారణ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాత గతేడాది ఆస్కార్ అవార్డు(Oscars 2024) కొట్టడంతో ఆస్కార్ అవార్డులపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లో ఘనంగా నిర్వహించారు. అందరూ ఊహించినట్టుగానే, ఓపెన్‌హైమర్ సినిమా ఉత్తమ నటుడు, దర్శకుడు, సినిమా కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది.
ఇక ఈ ఏడాది ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఎవరో ఈ లిస్ట్ లో చూసేయండి..
Oscars 2024:
ఉత్తమ నటుడు:
సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ దర్శకుడు:
క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి:
ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ సహాయ నటుడు:
రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయ నటి:
డ్వేన్ జో రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
బెస్ట్ హెయిర్ అండ్ మేకప్:
నాడియా స్టాసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే:
కార్డ్ జెఫర్‌పున్ (అమెరికన్ ఫిక్షన్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే:
జస్టిన్ ట్రిట్, ఆర్థర్ హారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్:
ది బాయ్ అండ్ ది హిరాన్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్:
హోలీ వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్:
జేమ్స్ ప్రైస్, షోనా హీత్ (పూర్ థింగ్స్)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం:
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ ఫోటోగ్రఫీ దర్శకుడు:
హయాటే వన్ హోటెమా (ఓపెన్‌హైమర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్:
గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకి, క్యోకో షిబుయా, మకాషి టకాసాకి, తట్సుజీ నోజిమా)
ఉత్తమ ఎడిటింగ్:
ఓపెన్ హైమర్ (జెన్నిఫర్ లేమ్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్:
ది లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రౌవర్స్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్:
20 డేస్ ఇన్ మారియుపోల్
ఉత్తమ ఫోటోగ్రఫీ:
ఓపెన్ హైమర్ (హోయటే, హోయ్టెమా)
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్:
ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ సౌండ్:
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టోర్న్ విల్లర్స్, జానీ బర్న్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్:
ఓపెన్ హీమర్ (లుడ్విగ్ గోరన్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్:
వాట్ వాస్ ఐ మేడ్ ఫర్ (బార్బీ మూవీ)
Also Read: మా నాన్న దర్శకత్వంలో అసలు నటించను..పూరి కొడుకు సంచలన కామెంట్స్!