TTDP First list: తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. అధికార పక్షం ఏకంగా 115 స్థానాల్లో బరిలోకి దింపుతున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం తో షాక్ తిన్న ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థుల లిస్ట్ ను సాధ్యమైనంత త్వరలో విడుదల చేయడానికి కసరత్తు మొదలు పెట్టారు. దీంతో ఏ క్షణంలో అయినా.. ప్రధాన ప్రతిక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేయవచ్చు. అయితే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను వెల్లడించడంతో.. దాన్ని బట్టి బరిలోకి దింపాల్సిన వాళ్ల పై మరోసారి ప్రతిపక్షాలు మరింత కసరత్తు చేసి లిస్ట్ ఫైనల్ చేసే పనిలో పడ్డాయి.
పూర్తిగా చదవండి..TTDP First list: స్పీడ్ పెంచుతున్న ప్రతిపక్షాలు.. త్వరలోనే టీ టీడీపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్..!
తెలంగాణ రేస్ లో తాము ఉన్నామని చెబుతున్న తెలుగు తమ్ముళ్లు కూడా 36 మందితో ఈ నెల 23 ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక జాబితాను ఫైనల్ చేసే విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసానితో పాటు ఇంకా ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అయితే తెలంగాణలో పార్టీ ఉండడం చారిత్రాత్మక అవసరమని.. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు..
Translate this News: