మోడీ వ్యాఖ్యలను తప్పుపట్టిన ప్రతిపక్షాలు...!!

దేశంలో ఉమ్మడి ఉమ్మ‌డి పౌర‌స్మృతిని అమలు చేయాలని ...దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మంగళవారం భోపాల్‎లో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిధ్యాన్ని దెబ్బతీయడమే అని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.

New Update
PFI వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా INDIA ఉంది... మోదీ సంచలన వ్యాఖ్యలు..!!

మధ్యప్రదేశ్‎లోని భోపాల్‎లో మంగళవారం నిర్వహించిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై మోడీ డైరెక్ట్ గా అటాక్ చేశారు. దేశంలో ఉమ్మడి పౌర‌స్మృతిని అమలు చేయాలని..కానీ దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మోడీ ఆరోపించారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిధ్యాన్ని దెబ్బతీయడమేనని ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోడీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, డీఎంకే, ఎంఐఎం పార్టీలు ఆరోపించాయి.

publive-image

మణిపూర్ లో జరుగుతున్న హింస గురించి మాట్లాడని ప్రధాని మోడీ...ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి పల్లెత్తుమాట చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసీసీ అమలు గురించి మోడీ ప్రస్తావించడం సరైంది కాదంటూ ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ఉమ్మ‌డి పౌర‌స్మృతి అంటూ ముస్లిం వర్గాన్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయంటూ మోడీ తన ప్రసంగంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రజలకు రెండు రకాల నిబంధనలు ఉంటే ఒక కుటుంబం ఎలా పనిచేస్తుందని..అప్పుడు దేశం ఎలా పనిచేస్తుందని మోడీ ప్రశ్నించారు.

ఉమ్మ‌డి పౌర‌స్మృతి కావాలంటే పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెట్టవచ్చు. ఎవరేం అడ్డుకోవడం లేదు కదా అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ అన్నారు. ప్రస్తుతం బీజేపీ సర్కార్ ఉందని..పార్లమెంట్ లో యూసీసీ ప్రవేశపెట్టకుండా, ప్రతిపక్షాలపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు. యూసీసీ పేరుతో ప్రతిపక్షాలపై రాళ్లు రువ్వడం సరికాదన్నారు.

ఇదే విషయంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. భారత్ లో ఉన్న బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని మోడీ సమస్యగా చూస్తున్నారని.యూసీసీ పేరుతో దేశానికి ఉన్న ఔనత్యాన్ని తగ్గిస్తారా అని ప్రశ్నించారు. యూసీసీ గురించి మోడీ మాట్లాడుతున్నారంటే..అప్పుడు హిందూ సివిల్ కోడ్ గురించి కూడా మోడీ మాట్లాడిల్సిందేనన్నారు. పంజాబ్ కు వెళ్లి యూసీసీ గురించి వారితో చర్చించండి. అప్పుడు వాళ్ల రియాక్షన్ ఏంటో మీకు తెలుస్తుందన్నారు.

దేశంలో ప్రతి ఆలయంలో పూజలు చేసేందుకు ఎస్టీలకు అనుమతి ఇవ్వండి..యూసీసీ తమకు అవసరం లేదన్నారు డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్.

Advertisment
Advertisment
తాజా కథనాలు