Oppo Reno 10: ఒప్పో ట్రిపుల్ ధమాకా...ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు రిలీజ్..!!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఒప్పో భారత మార్కెట్లోకి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. రెన్ 10 సిరీస్ లో ఒకసారి మూడు ఫోన్లను విడుదల చేసింది. వీటితోపాటు ఎంకో సిరీస్ లో కొత్త twsఇయర్ బడ్స్ ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

New Update
Oppo Reno 10:  ఒప్పో ట్రిపుల్ ధమాకా...ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు రిలీజ్..!!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారుదారు సంస్థ అయిన ఒప్పో తన రెనో 10 సిరీస్‌ను ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేసింది. కంపెనీ ఈ కొత్త సిరీస్ లో ఒప్పో రెనో 10, రెనో 10 ప్రో, రెనో 10 ప్రో+ వంటి మూడు మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు పరికరాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలను చూద్దాం.

publive-image

ఒప్పో రెనో 10 సిరీస్: ధర:
ఒప్పో రెన్ 10 ప్రో 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 39,999. మరోవైపు, రెనో 10 ప్రో+ ధర రూ.54,999గా నిర్ణయించింది కంపెనీ . ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు జూలై 13 నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్‌ల కలర్ ఆప్షన్‌లు గ్లోసీ పర్పుల్, సిల్వరీ గ్రే కలర్ లో ఉండనున్నాయి.

స్టాండర్డ్ ఒప్పో రెనో 10 ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీని ధర జూలై 20న ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐస్ బ్లూ, సిల్వరీ గ్రే కలర్ వేరియంట్‌లలో రానుంది.

ఒప్పో రెనో 10 సిరీస్: టాప్ 4 ఫీచర్లు
-ఒప్పో రెనో 10 ప్లస్ ప్రో HDR10+, 120Hz LTPS డైనమిక్ రిఫ్రెష్ రేట్ తోపాటు 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇచ్చే 6.74-అంగుళాల AMOLED 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. మరోవైపు, రెనో 10 ప్రో, 6.7-అంగుళాల FHD+ OLED 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది HDR10+ సపోర్టు ఇస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. చివరగా, ప్రామాణిక రెనో 10 5G కూడా ప్రో మోడల్ మాదిరిగానే డిస్ప్లే స్పెక్స్‌ను పొందుతుంది.

-ఒప్పో రెనో 10 ప్లస్ ప్రో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1 ప్రాసెసర్ తో అమర్చబడి ఉంటుంది. ఇది 12జీబీ LPDDR5 ర్యామ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ColorOS 13.1తో రన్ అవుతుంది. మరోవైపు, ఒప్పో రెనో 10, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జీ చిప్‌సెట్‌తో ఆధారితం, గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. వెనిలా మోడల్ 8జీబీ ర్యామ్ తో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 SoCపై రన్ అవుతుంది.

-ఒప్పో రెనో 10 ప్లస్ 64మెగాపిక్సెల్ OIS పెరిస్కోప్ సెన్సార్‌ను పొందుతోంది. ఇది 50మెగాపిక్సెల్ OIS సోనీ IMX890 సెన్సార్, 8మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్‌తో జత చేసి ఉంటుంది. ప్రో వేరియంట్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50మెగాపిక్సెల్ OIS సోనీ IMX890 సెన్సార్, 32మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 8మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి.

ఇదే కాకుండా, వనిల్లా మోడల్ 64మెగాపిక్సెల్ OIS మెయిన్ సెన్సార్, 32మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 8మెగాపిక్సెల్ సెన్సార్‌ను పొందుతోంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, ఒప్పో రెనో 10 సిరీస్‌లోని మూడు మోడళ్లలో 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

-బ్యాటరీ విషయానికి వస్తే ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ను కేవలం 27 నిమిషాల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

రెనో 10 ప్రో 4600mAh బ్యాటరీతో వస్తుంది, దీనితో 80W SuperVOOC ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 28 నిమిషాల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ అవుతుంది.

ఒప్పో రెనో 10 ప్రో వనిల్లా మోడల్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 67W SuperVOOC ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ డివైస్ 47 నిమిషాల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ చేస్తుంది.

ఒప్పో రెనో 10 సిరీస్‌తో పాటు, కంపెనీ తన తాజా ఇయర్‌బడ్స్ ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రోని కూడా భారత్ లో విడుదల చేసింది. రూ. 4,999 ధరతో జూలై 11 నుండి ఫ్లిప్‌కార్ట్, Oppo అధికారిక ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ స్టోర్‌లలో గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి ఇయర్ బడ్స్ అందుబాటులో ఉంటాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు