Oppenheimer: సెక్స్ సీన్‌లో భగవద్గీత పారాయణం.. హాలీవుడ్ చిత్రంపై హిందువుల ఆగ్రహం ఈ ప్రపంచంలో ఎవరి మత విశ్వాసాలు వారికుంటాయి. మీ మతాన్ని అభిమానించండి.. పరమతాన్ని గౌరవించండి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తుల తీరుతో కొన్ని మతాలకు చెందిన భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. తాజాగా హాలీవుడ్ సినిమాలోని ఓ సన్నివేశంపై హిందూవులు తీవ్రంగా మండిపడుతున్నారు. By BalaMurali Krishna 23 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి సెక్స్ సీన్‌లో భగవద్గీత పారాయణం.. టెనెంట్, ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ తీసిన తాజా చిత్రం 'ఓపెన్‌హైమర్'(Oppenheimer). ఈ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసిన రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా కంటెంట్ అద్భుతమంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మన ఇండియాలో మాత్రం వివాదాస్పదమవుతోంది. ఎందుకంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత పుస్తకం ఓ సెక్స్ సీన్‌లో కనపడుతోంది. దీంతో హిందూ సంఘాలు ఈ సినిమా మేకర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ధార్మిక సంఘాల ఆగ్రహం.. ఓ సన్నివేశంలో హీరోయిన్‌గా నటించిన ఫ్లోరెన్స్ భగవద్గీత చేత పట్టుకుని నగ్నంగా బెడ్ వద్దకు వస్తుంది. అనంతరం ఆమెతో ఇంటిమేట్ సన్నివేశంలో హీరో సిలియన్ మర్ఫీ భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సన్నివేశమే ఇండియాలో పెను దుమారానికి దారి తీసింది. హిందువుల పవిత్ర గ్రంధాన్ని సెక్స్ సన్నివేశంలో చూపించడంపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కోట్లాదిమంది హిందువుల ఆరాధించే భగవద్గీత గ్రంధాన్ని ఇలాంటి అభ్యంతకర సన్నివేశంలో చూపించడంపై ఫైర్ అవుతున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా మూవీ మేకర్స్‌పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. భక్తుల మనోభావాలను కించపరిచేలా సన్నివేశాలు ఎలా చూపిస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. MOVIE OPPENHEIMER’S ATTACK ON BHAGWAD GEETA Press Release of Save Culture Save India Foundation Date: July 22, 2023 It has come to the notice of Save Culture Save India Foundation that the movie Oppenheimer which was released on 21st July contains scenes which make a scathing… pic.twitter.com/RmJI0q9pXi — Uday Mahurkar (@UdayMahurkar) July 22, 2023 అభ్యంతకర సన్నివేశం తొలగించాలి.. తక్షణమే ఈ సినిమా మేకర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ సన్నివేశాలను తొలగించాలంటూ సేవ్ కల్చర్- సేవ్ ఇండియా ఫౌండేషన్ డిమాండ్ చేసింది. అసలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇండియాలో ఈ సినిమాకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రశ్నించింది. ఇప్పటికే కొన్ని అభ్యంతకరమైన సన్నివేశాలను చిత్రబృందమే స్వయంగా కట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సన్నివేశం ఉంచడంతోనే ఇప్పుడు వివాదానికి కారణమైంది. మరి ఈ సన్నివేశం తొలగించకుండా సెన్సార్ బోర్డు ఏం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా విషయానికొస్తే జులై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇండియాలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే భారత్‌లో రూ.20కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ వీకెండ్ ముగిసే సరికి రూ.50 కోట్ల మార్క్ దాటే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 100 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా 1,200 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి