ఆపరేషన్ హరీష్ : పొంగులేటికి షాక్ ఇచ్చేలా ఆయన ముఖ్య అనుచరునికి గాలం

మాజీఎంపీ, ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు అధికారపక్షం బీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఇక మొదటి నుంచి పొంగులేటి వెంటే ఉన్న తెల్లం వెంకటరావు ఆయన్ని విడిచి.. పొంగులేటి బయటికి వచ్చిన పార్టీలోనే జాయిన్ అవ్వడం బిగ్ షాక్ ఇచ్చింది.

New Update
ఆపరేషన్ హరీష్ : పొంగులేటికి షాక్ ఇచ్చేలా ఆయన ముఖ్య అనుచరునికి గాలం

పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ వార్ ఖమ్మం రాజకీయాలలో కలకలం రేపుతోంది.  తెలంగాణ  పాలిటిక్స్ లో కూడా  ఇది హాట్ టాపిక్ గా మారింది.  పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి చేరగానే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.  ప్రచార కమిటీలో వైస్ ఛైర్మన్ గా నియమిస్తూ కీలక బాధ్యతలను అప్పగించింది. మరో వైపు ఖమ్మంలో ఆయన అనుచరులు ఆయనతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకోగా..ఇతర పార్టీల్లోని నేతలను ముఖ్యంగా జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ సెకండ్ క్యాడర్ నేతలను సైతం పొంగులేటి కాంగ్రెస్ లోకి లాగుతున్నారు.

publive-image తెల్లం వెంకట్ రావు

ఖమ్మంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్..
మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరిన తరువాత ఖమ్మం రాజకీయాల్లో హీట్ రోజు రోజుకి పెరుగుతోంది. పొంగులేటి అనుచరులపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు పార్టీని స్ట్రాంగ్ చేసుకోవడానికి పొంగులేటి ఇంకా బీఆర్ఎస్ ఇద్దరు పోటాపోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావును టార్గెట్ చేసింది. ఇక 2018 ఎన్నికల్లో తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ నుంచి భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఖమ్మం సభలో పొంగులేటితో పాటు తెల్లం వెంకట్రావు కూడా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
ఇప్పుడు తెల్లం పార్టీ మారబోవటంతో పొంగులేటి కంగుతినక తప్పని పరిస్థితి ఏర్పడింది.

పొంగులేటి పై మంత్రి హరీశ్ రావు మిషన్..!
టబ్రుల్ షూటర్ మంత్రి హరీష్ రావ్ చక్రం తిప్పడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పొంగులేటి ప్రధాన అనుచరులే టార్గెట్ గా చేరికల మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే బీఆర్ఎస్ గూటికి డా. తెల్లం వెంకట్రావ్ చేరబోతున్నారు. మరికొందరు పొంగులేటి అనుచరులతో సైతం మంత్రి హరీష్ రావ్ మంతనాలు జరుపుతున్నారు. అయితే టికెట్ ఆఫర్లతో పొంగులేటి శిబిరంలో మంత్రి హరీష్ రావ్ కల్లోలం రేపుతున్నారు.

మరికొందరిపై వల

గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వనని మాజీ ఎంపీ పొంగులేటి శపథం చేశారు. పొంగులేటి శపథాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఆయన ప్రధాన అనుచరులను చేర్చుకుని కొన్ని స్థానాలు కల్పించాలని వ్యూహ రచన చేస్తోంది.దీంతో ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో బలంగా ఉన్న పొంగులేటి అనుచరులపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెట్టింది..ఇల్లందు మాజీ ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ కోరం కనయ్యను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో నిలిచిన ఓడగొట్టి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక్కొక్కరిగా సైనికులు పక్కదారి పడుతున్న నేపథ్యంలో పొంగులేటి ముందున్న దారి ఏంటనేది ఆసక్తిగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు