Demat Account: డీమ్యాట్ ఎకౌంట్స్ ఓపెనింగ్స్ లో డిసెంబర్ 2023 రికార్డ్ సృష్టించింది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ - నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ డేటా ప్రకారం, డిసెంబరులో మొత్తం 41.78 లక్షలకు పైగా డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేశారు. నెల క్రితం ఈ సంఖ్య 27.81 లక్షలు కాగా ఏడాది క్రితం 21 లక్షలు. మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఇప్పుడు 13.93 కోట్లు దాటింది. ఇది ఒక నెల క్రితం కంటే 3.1% - ఒక సంవత్సరం క్రితం కంటే 28.66% పెరిగింది.
డీమ్యాట్ ఎకౌంట్స్ పెరుగుదలకు మూడు కారణాలు
1. స్టాక్ మార్కెట్‌లో నిరంతర పెరుగుదల
స్టాక్ మార్కెట్ నిరంతరం కొత్త గరిష్టాలను సాధిస్తోంది. ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ అంటే IPO సానుకూలలిస్టింగ్స్ కూడా మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. ఇటీవలి అస్థిరత - లాభాల స్వీకరణ ఉన్నప్పటికీ మార్కెట్ బుల్లిష్‌గా ఉంటుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కోసం కొత్తవారు ముందుకు వస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే, 2023లో సెన్సెక్స్ - నిఫ్టీ రెండూ 18.8% - 20% పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 45.5% - 47.5% జంప్ చేశాయి. మార్కెట్ బూమ్ FOMOకి దారితీసింది. అంటే మిస్సింగ్ అనే భయం. దీంతో డిసెంబర్‌లో డీమ్యాట్ ఖాతాలు(Demat Account) పెరిగాయి.
2. స్థిరమైన ప్రభుత్వం వస్తుందనే అంచనాలు..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటు కానుందనే నమ్మకం పెరిగింది. ఇది మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా భావిస్తున్నారు. స్థిరమైన ప్రభుత్వం మరోసారి వస్తుందన్న అంచనాల మధ్య స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు(Demat Account) కూడా పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: పెట్రోల్ లో ఇథనాల్ కలపడంతో మన దేశంలో ఎంత డబ్బు మిగిలిందో తెలిస్తే అవాక్కవుతారు
3. స్ట్రాంగ్ ఇండియన్ ఎకానమీ
Q2FY24 అంటే జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి GDP డేటా నవంబర్ 30న విడుదలైంది. ఇది RBI అంచనాల కంటే 7.6% ఎక్కువ. Q2FY24లో RBI GDP వృద్ధిని 6.5%గా అంచనా వేసింది. ఇది కాకుండా, GST వసూళ్లు కూడా మెరుగైన ఆర్థిక వ్యవస్థను సూచిస్తున్నాయి.
12 నెలల్లో 20 కోట్ల డీమ్యాట్ ఎకౌంట్స్..
బ్యాంక్ నేతృత్వంలోని బ్రోకర్లు వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మధ్య త్రీ-ఇన్-వన్ ఖాతా సౌకర్యాన్ని అందించడం ద్వారా పెద్ద కస్టమర్ బేస్‌ను ఆకర్షిస్తున్నారు. మెహతా ఈక్విటీస్ డైరెక్టర్ ప్రశాంత్ బన్సాలీ మాట్లాడుతూ- రానున్న 12 నెలల్లో 20 కోట్ల డీమ్యాట్ ఖాతాల(Demat Account)ను చేరుకునే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. మొత్తమ్మీద స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ధోరణి సామాన్యులలో కూడా పెరుగుతుందనే విషయాన్ని డీమ్యాట్ ఎకౌంట్స్ లో పెరుగుదల బయటపెడుతోందని నిపుణులు అంటున్నారు.
Watch this interesting Video: