Amrit Bharat Station : దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం..తెలుగు రాష్ట్రాల్లో ఇవే.!

దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద 554 రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.ఈ స్టేషన్ల అభివృద్ధికి రూ. 1900కోట్లు వెచ్చించనున్నారు. ఏపీ 34, తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

New Update
Amrit Bharat Station : దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం..తెలుగు రాష్ట్రాల్లో ఇవే.!

Amrit Bharat Station :  అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద మనదేశంలో రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయికి చేర్చడానికి కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 554 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇందులో అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. ఈ స్టేషన్ 2025-26లోప్రయాణానికి సిద్ధం కానున్నాయి. వీటిలో జైపూర్ రైల్వే డివిజన్‌లోని 16 రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హెరిటేజ్ లుక్ ప్రవేశ ద్వారాలు నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్ల అభివృద్ధికి రూ. 19,000కోట్లు వెచ్చించనున్నారు. 2,000కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో ఆన్ లైన్ మోడ్ ద్వారా ఇది నిర్వహించనున్నారు.

ఈ స్కీం కింద 1275 స్టేషన్లను డెవలప్ చేస్తుంది. వాటిలో కొన్ని ఇప్పటికే డెవలప్ చేయగా..మరికొన్ని స్టేషన్లలో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి కొన్నిస్టేషన్లలో పనులు షురూ అయ్యాయి. అమ్రుత్ భారత్ స్కీం కింద, దేశంలోని 27 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అమృత్ భారత్ స్టేషన్లను రూ. 19,000కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో తిరిగి డెవలప్ చేయనున్నారు. ఆయా స్టేషన్లలో ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియం, ఫుడ్ కోర్టు, విశాలమైన పార్కింగ్ స్థలంతోపాటు అత్యాధునిక ప్రయాణీకులసౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.

27 రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో ఏకకాలంలో 554 స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల దేశంలోని లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 554 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేయడం రైల్వే చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. వైష్ణవ్ మాట్లాడుతూ 2014లో రైల్వే బ్రిడ్జిలు నిదానంగా నిర్మించారని, ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రీడెవలప్ మెంట్ లో భాగంగా ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లను డెవలప్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఇది కూడా చదవండి:  ప్రముఖ సింగర్‌ కన్నుమూత!

Advertisment
Advertisment
తాజా కథనాలు