/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Ooru-Peru-Bhairavakona1-jpg.webp)
Ooru Peru Bhairavakona : టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఊరుపేరు భైరవకోన. ఈ మూవీ వీఐ ఆనంద్ డైరెక్షన్ లో వస్తోంది. ఇందులో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు ముందే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలివడం పక్కా అయినట్లే అనిపిస్తోంది తాజా అప్ డేట్స్ ను చూస్తుంటే. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ నిజమేనని చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ..అందర్నీ ఆకట్టుకుంటోంది.
లేటేస్టుగా మరోసాంగ్ రెండో సింగిల్ హమ్మ హమ్మ సాంగ్ కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తోంది. ఈ పాట యూట్యూబ్ లో 15 మిలియన్లకు పైగా వ్యూస్ టాక్ ను సొంతం చేసుకుంది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్న క్లారిటీ వచ్చేసింది. ఈమధ్యే మూవీ మేకర్స్ హమ్మ సాంగ్ మేకింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేయడంతో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Vibing with the tribe 💯
Here are a few making stills of #HummaHumma 📸#OoruPeruBhairavaKona 2nd single🎵
- https://t.co/JsSynr4s2E@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana #ShekarChandra @AnilSunkara1 @RajeshDanda_ pic.twitter.com/FEMSnbYaK7— Hasya Movies (@HasyaMovies) November 2, 2023
ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్ కాగా..ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర సమర్ఫణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 16వ తేదీని ప్రేక్షకుల ముందుకు రానుంది.
Dive into the mesmerizing world of #HummaHumma Lyrical Song from #OoruPeruBhairavakona as it surpasses 1️⃣5️⃣M+ views on #YouTube ♥️
🎤 @Ram_Miriyala
📝 #TirupathiJaavana
🎼 #ShekarChandra@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar… pic.twitter.com/dvfZeGdzfr— BA Raju's Team (@baraju_SuperHit) January 31, 2024
ఇది కూడా చదవండి : చెప్పేది కొండంత, చేసేది గోరంత కూడా లేదు..కాంగ్రెస్ వన్నీ ఒట్టిమాటలే..!!