ఇది ఫాలో అవ్వకపోతే మీ జాబ్‌ కూడా ఫసక్కే.. అందరూ తప్పక తెలుసుకోవాల్సిందిదే..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కారణంగా ఉద్యోగాలు ఊడుతాయని ఏ మాత్రం భయం అక్కర్లేదు. టెక్‌ నాలెడ్జ్‌ పెంచుకుంటూ కాలంతో పాటు పరుగులు తీసేలాగా మన మైండ్‌సెట్‌ని మార్చుకోవాలంటున్నారు మార్కెట్‌ నిపుణులు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సృష్టిస్తున్న అద్భుతాలను చూసి ఆశ్చర్యపోకుండా ఏఐ పట్ల జ్ఞానం పెంచుకోవాలని.. జరుగుతున్న మార్పులను గమనిస్తూనే టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలని సూచిస్తున్నారు.

New Update
ఇది ఫాలో అవ్వకపోతే మీ జాబ్‌ కూడా ఫసక్కే.. అందరూ తప్పక తెలుసుకోవాల్సిందిదే..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(artificial intelligence) వల్ల ఉద్యోగాలు ఊడడం ఖాయమని.. పలు రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని సర్వత్రా భయాలు నెలకొన్న వేళ మార్కెట్‌ నిపుణుల నుంచి ఓ పాజిటివ్‌ పాయింట్ వినిపిస్తోంది. ఏఐ(AI) వల్ల పాత ఉద్యోగాలు పోతాయన్న మాట నిజమేనని అయితే ఓ చిన్న చిట్కా ఫాలో అయితే అసలు ఉద్యోగం పోతుందన్న భయం అవసరం లేదని చెబుతున్నారు. ఇంతకి మార్కెట్ నిపుణులు ఇస్తున్న ఆ టిప్‌ ఏంటి?

ఇది ఫాలో అవ్వండి:
ట్రెండ్‌కి తగ్గట్టే మనిషి తన ఆలోచనా తీరును మార్చుకోవాలి. లేకపోతే కాలం అందనంతా దూరం వెళ్లిపోతుంది కానీ మనం మాత్రం ఇంకా వెనక్కే ఉండిపోతాం. అందుకే లేటెస్ట్ టెక్‌ ట్రెండ్స్‌ ఫాలో అవుతూ ఉండాలి. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ జపం చేస్తుండగా.. దీనికి సంబంధించి వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలంటున్నారు టెక్‌ నిపుణులు. కంప్యూటర్ల ఎంట్రీ సమయంలోనూ జాబ్స్‌ పోతాయన్న భయం ఉండేదని.. అయితే ప్రస్తుతం ఐటి సెక్టర్‌లో ఉన్న జాబ్స్‌.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇస్తున్న శాలరీ మరే ఇతర ఫిల్డ్‌లోనూ లేదన్న విషయం మరిచిపోవద్దు.. ఇప్పుడు ఐటీ ఎంప్లాయిస్‌ చేసే జాబ్స్‌ రోబోలు చేస్తున్నాయని.. ఏఐతో ఉద్యోగాలు పోతాయని భయం అవసరం లేదని.. టెక్నాలజీ మార్పులను గమనిస్తూ వాటిలో నైపుణ్యం పెంచుకునేలా ముందునుంచే జాగ్రత్తగా ఉంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇక AI సాంకేతికతను అదేదో ఎలియన్‌ లెవల్‌లో ఊహించుకోవాల్సిన పనిలేదు.. ప్రతిదీ మనిషి సృష్టే.. అది టెక్నాలజీ అయినా ఏదైనా మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు.. ఈ విషయం మరిచిపోవద్దు.. తెలుసుకోవాల్సింది కేవలం టెక్‌ నాలెడ్జ్‌ని అప్‌డేట్ చేసుకోవడం మాత్రమే..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కారణంగా కోట్లలో ఉద్యోగాలు పోతాయని.. అదే సమయంలో అదే స్థాయిలో జాబ్స్‌ క్రియేట్ అవుతాయన్నది నిపుణుల మాట. అందుకే ఏఐ పట్ల ఫొకస్‌ పెంచితే ఫ్యూచర్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదని.. ఒక జాబ్‌ పోయినా.. ఇంకో జాబ్‌ తెచ్చుకోవాచ్చని తెలుస్తోంది. ట్రెండ్‌కి తగ్గట్టుగా స్కిల్ పెంచుకుంటే కెరీర్‌కు ఎలాంటి సమస్యలూ ఉండవని చరిత్ర కూడా నిరూపిస్తోంది. AI అడ్వెన్స్‌కి చేరే సమయానికి ఎక్కువగా ప్రభావితమయ్యే ఉపాధి రంగాలలో ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫుడ్ సర్వీస్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ ఫిల్డ్స్‌లో ప్రస్తుతం జాబ్స్ చేస్తున్న వాళ్లు ముందునుంచే జాగ్రత్తగా ఉంటూ.. టెక్‌ నాలెడ్జ్‌ని అప్‌డేట్‌ చేసుకోవడం..AIకి సంబంధించి పలు కోర్సులు నేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉద్యోగాల మార్పు వల్ల తక్కువ సంపాదన ఉన్నవాళ్లు వేరే వృత్తి రంగాలకు వెళ్లేందుకు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందని నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

Advertisment
Advertisment