సీఎం కేసీఆర్ (CM KCR)పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ( Kishan Reddy)ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం (జూలై 27) మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం ప్రజల గొంతులు కోసే కుటుంబమని వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో ఫామ్‌హౌస్‌లో కూర్చుని తీయగా మాటలు చెబుతూ.. గొంతులు కోసే కుటుంబమన మండిపడ్డారు. బంగారు తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కౌలు రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ విత్తనాలకు గులాబీ దండే కారణమన్నారు. రైతులపై ఎన్ని కేసులు పెట్టారో కేసీఆర్ చెప్పాలన్నారు. రైతుల కోసమే పుట్టిన అంటివి కేసీఆర్.... ఉచిత ఎరువులు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో మాత్రమే 24 గంటల కరెంట్ ఉందన్నారు. కేసీఆర్ కుటుంబానికి కరెంట్ ఉంది కానీ.. రైతులకు 24 గంటల కరెంట్ లేదని తెలిపారు. ధరణి పోర్టల్ పేరుతో రైతులను ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని.. కేసీఆర్‌ను నమ్మవద్దని అన్నారు. నిజమైన రైతు సంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు. పోలీసులను పెట్టుకొని ప్రగతి భవన్ (Pragati Bhavan)నుంచి కేసీఆర్ ( KCR) పాలన చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా ప్రగతి భవన్ (Praja Pragati Bhavan)గా తీర్చిదిద్దుతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతు సంక్షేమంపై ప్రత్యేకమైన దృష్టి సారించారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యనించారు.‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’అనే నినాదంతో అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యతనిస్తూ.. అన్నదాతలకు గౌరవాన్ని కల్పించే విధంగా పలు పథకాలకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. రైతులకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, భూసార పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పీఎం-కిసాన్ ద్వారా రైతుల అకౌంట్లలో ఏడాదికి రూ.6వేల రూపాయలు బదిలీ చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను చెపట్టిందన్నారు.
ప్రజలకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు.. ఒకేచోట అందుబాటు ధరలకు దొరుకుతాయన్నారు. విత్తన పరీక్ష, భూసార పరీక్ష, ఎరువుల పరీక్షలను ఈ సెంటర్ ద్వారా అందిస్తామన్నారు. వ్యవసాయానికి అవసరమైన పరికరాలను.. రైతులకు అమ్మడం అవసరమైతే రైతులకు కిరాయికి ఇవ్వడం ఈ కేంద్రాల ద్వారా చేస్తామన్నారు. ఆధునిక, ఉత్తమ వ్యవసాయ పద్ధతుల మీద రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు రైతులకు ఉపయోగపడే విధంగా చైతన్య పరుస్తూ.. దీంతోపాటుగా.. ఈ కేంద్రాలు నడిపె రిటైలర్ల సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 8.5 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లోకి రూ.17,500 కోట్లు జమచేయనున్నారు. మన తెలంగాణలో 39.5 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి రూ.800 కోట్లు జమ అవుతాయని కిషన్‌రెడ్డి అన్నారు.