చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే వేడి కాఫీ, టీ లేకుండా నిద్రలేవలేరు. అయితే ఎక్కువ మంది కాఫీనీ తాగటానికి ఇష్టపడతారు. ఉదయాన్నే కాదు రోజుకు మూడు నుంచి ఐదు సార్లు కాఫీ తాగేవారూ ఉన్నారు. కొందరు దీన్ని ఎక్కువ పాలతో తాగుతారు, మరికొందరు తక్కువ చక్కెరతో తాగుతారు, అంతే కాదు, కొంతమంది తమ రోజును ఒక కప్పు బ్లాక్ కాఫీతో కూడా గడుపుతారు.
మీరు ఇలాంటి కప్పు కాఫీని ఆస్వాదించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, ఒక ఫుడ్ బ్లాగర్ ప్రయోగం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సింగపూర్‌కు చెందిన కాల్విన్ లీ తన కాఫీలో ఉల్లిపాయను వేసి సిప్ చేశాడు.వీడియోలో, లీ మొదట సాదా కాఫీని తయారుచేసి, దానికి ఉల్లిపాయ ముక్కలను వేశాడు. ఒకదానితో ఒకటికలిపిన తరువాత దాన్ని అతను తాగిన వీడియో వైరల్ అయ్యింది.
లీ మాట్లాడుతూ, "నాకు ఉల్లిపాయలు ఇష్టం, కానీ ఆనియన్ కాఫీతో కాదు." పోస్ట్ చేసినప్పటి నుండి, చాలా మంది వినియోగదారులు తమ శుభాకాంక్షలను,వారి అభిప్రాయాలను, వ్యాఖ్యలను పంచుకుంటున్నారు. చాలా మంది ఈ ప్రయోగాన్ని తిరస్కరించారు. మరికొందరు మనం కూడా అలాంటి ప్రయత్నం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. కొందరు బదులుగా వేయించిన ఉల్లిపాయలను ఉపయోగించమని సూచించారు.
కొన్ని వారాల క్రితం, నేను స్ప్రింగ్ ఆనియన్స్ లేదా చివ్స్‌తో కూడిన కాఫీని చూశాను. కొన్ని రోజుల క్రితం మిరపకాయతో కాఫీ... ఇప్పుడు ఆనియన్ తో కాఫీ చూశాను. తరవాత ఏంటి? అని చాలా మంది యూజర్లు కూడా ప్రశ్నించారు.. ఇలాంటి ఆహారపదార్థాలు చేర్చకూడదని మనకు తెలుసు, అలా చేస్తే నాలుక ముందు నో చెప్పేస్తుంది. అయితే నేను చేయను. దానికి బదులు నేను కొబ్బరి పాలతో తింటాను అని కూడా ఒక వ్యక్తి చెప్పాడు. వండిన ఉల్లిపాయలు మరింత రుచిగా ఉంటాయని కూడా ఎవరో చెప్పారు. ఇది కాఫీని అవమానించడమేనని మరొకరు అన్నారు.