ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఘర్షణకు రీజన్ ఇదే.! ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి వివరణ ఇచ్చారు. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే క్లాస్ రూమ్ లో గొడవ జరిగిందని అన్నారు. కులాల కోసమో..గంజాయి కోసమో కాదని క్లారిటీ ఇచ్చారు. By Jyoshna Sappogula 22 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై కార్లిటీ ఇచ్చారు డిఎస్పీ నారాయణస్వామి రెడ్డి. సోషల్ మీడియాలో మెడికల్ కాలేజీ విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి గంజాయి కోసం క్లాస్ రూమ్ లో కొట్టుకున్నట్లు, ఎస్సీలు, ఇతర వర్గాలు విడిపోయి దాడులు చేసుకున్నట్లు ప్రచారం జరుగిందని..అయితే అది అవాస్తవమని తెలిపారు. Also read: పూజల పేరిట లక్షల్లో దండుకోని ఉడాయించిన ముఠా..! వాస్తవానికి మెడికల్ కాలేజీలో మూడోవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.. రెండు వర్గాలుగా విడిపోయి హాస్టల్ మెస్ విషయంలో గొడవ పడ్డారని తెలిపారు. కొంతమంది కాంట్రాక్టర్ ద్వారా మెస్ నడపాలని, కొంతమంది విద్యార్థుల ద్వారా నడపాలన్నారు. కొంతమంది మద్యం తాగి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నందున ఆగస్టు 2023 నెలలో కళాశాల ప్రిన్సిపల్, కమిటీ వారు విచారణ జరిపి మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పై చర్యలు తీసుకొని వారిని హాస్టల్ నుండి బయటకు పంపించారని చెప్పారు. ఈ విధంగా హాస్టల్లో లేకుండా చేయడానికి కారణమైన వారిని టార్గెట్ చేశారు ఆ విద్యార్థులు. తాజాగా, ఈఎన్ టి క్లాసులో ఇద్దరు విద్యార్థులు సెమినార్ ఇస్తుండగా దానిపై కామెంట్స్, సెటైర్స్ వేసుకున్నారని.. క్లాస్ లెక్చరర్ వెళ్లిపోయిన తర్వాత విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని అన్నారు. ఈ సంఘటనను పలువురు విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపారు. ఆ తర్వాత ఇరు వర్గాల వారు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకటరమణకి ఫిర్యాదు చేశారన్నారు. ఒక వర్గానికి చెందిన యశ్విన్ మరియు మరొక వర్గానికి చెందిన గిరిధర్ కు గాయాలైయ్యాయని తెలిపారు. ప్రస్తుతం వారు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు గ్రూపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు ఉన్నారని.. ఇది కులాల మధ్య జరిగిన గొడవ కాదని..గంజాయి కోసం జరిగిన గొడవ కాదని.. వ్యక్తిగతంగా క్లాస్ రూమ్ లో జరిగిన గొడవ అని వెల్లడించారు. ఇరువర్గాలు మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి